Varun motors owner join in ysr congress party

varun motors owner join in ysr congress party, ys jagan, ysr congress party, tdp, chandrababu naidu, Prabhu Kishore is the owner of Varun Motors, Prabhu Kishore, vizag lok sabha ticket, ys sharmila, yv subbarao,

varun motors owner join in ysr congress party

జగన్‌పార్టీలోకి వరుణ్

Posted: 07/09/2013 04:41 PM IST
Varun motors owner join in ysr congress party

వ్యాపారవేత్తగా పేరు గడించిన ప్రభు కిశోర్‌కు ( వరుణ్ మోటార్స్) వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకసభ టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభు కిశోర్ గతంలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా మెలిగేవారు. ఆయన విశాఖపట్నం లోకసభ సీటు టికెట్‌ను ఆశిస్తున్నారని అంటున్నారు. షర్మిల పాదయాత్ర సందర్భంగా ఆ పార్టీ పెద్దలు పెందుర్తిలో క్యాంపు వేశారు. అక్కడ వైవీ సుబ్బారెడ్డి తదితరులు సమావేశమై ఉండగా ప్రభు కిశోర్ వచ్చి వారిని కలిశారు. ఈ పరిణామం ఆ పార్టీ నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, అందుకే సుబ్బారెడ్డిని కలిశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు తరఫున విశాఖ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. విశాఖ నుంచి షర్మిల లేదంటే వైవీ సుబ్బారెడ్డి పోటీ చేస్తారని ఇప్పటి వరకు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ జాబితాలో ప్రభు కిశోర్ చేరారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles