Fire accident in kavuri rally

accident in kavuri rally, kavuri sambasivarao, union textile minister, eluru constituency, kavuri rally, telangana issue, party decision on telangana

fire-accident-in-kavuri-rally

కావూరి స్వాగత సంబరాలలో విషాదం

Posted: 07/02/2013 01:39 PM IST
Fire accident in kavuri rally

కావూరి సాంబశివరావు కేంద్రమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన ఏలూరు వెళ్తున్న సందర్భంలో ఆయనకు స్వాగతం పలుకుతూ చేసుకుంటున్న సంబరాలలో విషాదం చోటుచేసుకుంది.

హైద్రాబాద్ నుంచి గన్నవరం వరకు విమానం వెళ్ళిన కావూరి అక్కడి నుంచి ర్యాలీగా ఏలూరు బయలుదేరి వెళ్ళారు.  బాణా సంచా కాలుస్తున్నప్పుడు ప్రమాద వశాత్తూ బాణాసంచా నిలువ ఉంచిన ఆటోలో పడి ప్రమాదం చోటుచేసుకుంది.  బాణాసంచాను ఆటోలో తీసుకెళ్తున్నవారిలో ఇద్దరు గాయపడ్డారు.  హాస్పిటల్ కి తరలించిన తర్వాత ఆ ఇద్దరిలో ఒకరు మృతిచెందారు.  రెండవ వ్యక్తి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.

ఈ మధ్యకాలంలో కావూరి వ్యాఖ్యలు కూడా సీమాంధ్రులను కలవరపెట్టాయి.  రాష్ట్రమంతా కలిసికట్టుగా ఉండాలన్న సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతునిస్తూ వచ్చిన కావూరి సాంబశివరావు మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే మాటమార్చి, తెలంగాణా విషయంలో అధినేత్రి నిర్ణయం ఏదైనా తనకు శిరోధార్యమేనన్నారు.  అంతేకాదు, తన మాటలను సమర్థించుకుంటూ, తనిప్పుడు మామూలు కార్పొరేటర్ కాదని, జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవలసివుంటుందని ప్రకటించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles