High school boys for ragging

high school boys for ragging, SSC students of a municipal high school, guntur,

high school boys for ragging

స్కూల్లో మూత్రంతో ర్యాగింగ్

Posted: 07/02/2013 12:48 PM IST
High school boys for ragging

ర్యాంగింగ్ అంటే .. ఏ ఇంజనీరింగ్, ఏ మెడిసిన్ కాలేజీల స్థాయిలో ఉంటుందనే విషయం అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఆ ర్యాంగింగ్ భూతం ..హైస్కూల్లో కి ప్రవేశించింది. స్కూల్ స్థాయి నుంచే ర్యాంగింగ్ పడగ విప్పుతుంది. పాఠశాలల్లోనూ ర్యాగింగ్ పడగ విప్పుతోంది. కొందరు విద్యార్థులు ఓ విద్యార్థిని మంచినీళ్ల సీసా లో మూత్రం పోసిన వైనం గుంటూరులో వెలుగులోకి వచ్చింది. నగరపాలక సంస్థ పరిధిలోని కావటి శంకరరావు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది కొత్తగా ఓ బాలిక పదో తరగతిలో చేరింది. కొద్దిరోజుల కిందట అదే తరగతి విద్యార్థులు కొందరు ఆమెను మాటలతో వేధిస్తూ ర్యాగింగ్ చేశారు. ఆ బాలిక వారిని ప్రతి ఘటించి తీవ్రంగా హెచ్చరించింది. దీన్ని మనసులో పెట్టుకున్న విద్యార్థులు గతనెల 28న విద్యార్థిని మంచినీళ్ల సీసా తీసుకుని దాన్లో నీళ్లు పారబోసి మూత్రం పోసి ఏమీ తెలియనట్లు అక్కడ పెట్టారు. ఈ సంగతి తెలియని బాలిక వాటిని తాగింది. వాంతులు కావడంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు కె. మంజులాదేవి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె లాలాపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లాలాపేట సి.ఐ. రామాంజనేయులు పాఠశాలకు వెళ్లి విద్యార్థులను, సిబ్బందిని విచారించారు. ఘటనకు బాధ్యులైన ముగ్గురు విద్యార్థులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు సి.ఐ. చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles