No scope for telangana resolution kiran

N. Kiran Kumar Reddy, Andhra politics, Telangana statehood, Panchayat Raj elections, Andhra Pradesh,politics,state politics

Chief Minister N. Kiran Kumar Reddy on Monday said unless Congress high command gives a green signal, his government would not be able to move a resolution on separate Telangana in the Assembly.

తెలంగాణకు కిరణ్ నై..నై

Posted: 06/11/2013 09:17 AM IST
No scope for telangana resolution kiran

అసెంబ్లీ బడ్జెట్ రెండో విడత సమావేశాలు నిన్న ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  స్పీకర్ మనోహర్ అధ్యక్షతన శాసనసభా సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ నేతలు శాసనసభలో తెలంగాణ తీర్మానం చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేశారు. దీని పై ఆయన స్పందిస్తూ తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించేందుకు సిద్ధమేనని.. కానీ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా సభలో ఈ అంశంపై తీర్మానం చేసేది లేదని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై తీర్మానం చేయాల్సిందేనని, తర్వాత తెలంగాణ కోసం ఉద్యమించిన వారిపై కేసులు ఎత్తేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమం పైనా చర్చ జరగాలని టీఆర్ఎస్ఎల్పీ నేత రాజేందర్ పేర్కొన్నారు. సభా నిర్వహణ బాధ్యత అధికార పక్షంగా తమపై ఉందని, ప్రతిపక్ష సభ్యులను సమన్వయపరచే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంపై ఉందని సీఎం పేర్కొన్నారు. సమావేశాల కాలం పెంచాలని కోరడంలో తప్పేమీ లేదు గానీ సభ జరిగే సమయంలో ప్రజా సమస్యలపై చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles