Political daggubati venkateswara rao comment on tsr legal notice

daggubati venkateswara rao, mla daggubati venkateswara rao, congress party, tsr sends legal notice to daggubati, t subbarami reddy, vishakhapatnam, lok sabha, mp purandeswari,

daggubati venkateswara rao comment on tsr legal notice

లీగల్ నోటీసులు అందలేదు: దగ్గుబాటి

Posted: 06/10/2013 05:10 PM IST
Political daggubati venkateswara rao comment on tsr legal notice

విశాఖ లోక్ సభ సీటు కోసం ఇద్దరు కాంగ్రెస్ ముఖ్య నేతలు రోడ్డుకెక్కిన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంథేశ్వరి, రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి రాబోయే 2014 ఎన్నికల్లో విశాఖ నుండి పోటీ చేస్తానని, సిట్టింగ్ ఎంపీ గా దగ్గుబాటికి పురంథేశ్వరి కి నర్సారావు పేట నియోజకవర్గంలో పోటీ చేస్తుందని టి.సుబ్బరామిరెడ్డి ప్రకటించారు . ఈ ప్రకటనం పై పురంథేశ్వరి భర్త కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు మండిపడిన విషయం తెలిసిందే. టి.సుబ్బరామిరెడ్డి పై కొన్ని ఘాటైన విమర్శలు చేయటంతో.. ఆయన లీగల్ నోటీసు ఇవ్వటం జరిగింది. ఆయన పంపించిన లీగల్ నోటీసులు తనకు ఇంకా అందలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు వెల్లడించారు. ఆ నోటీసులు అందిన తర్వాత వాటిపై పూర్తి స్థాయిలో స్పందిస్తానని చెప్పుకొచ్చారు. దగ్గుబాటి తనపై ఇటీవల చేసిన ఆరోపణలు నిరూపించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని 12 అంశాలతో కూడిన నోటీసును దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు పంపించారు. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. టి. సుబ్బరామిరెడ్డి పై దగ్గబాటి వెంకటేశ్వర రావు విమర్శలను సీనియర్ కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. పొంగులేటి సుధాకర్ రావు దగ్గుబాటి పై మండిపడ్డారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles