Twist cbi jd says not recieved transfer orders

jd says not recieved transfer orders, CBI JD Lakshminarayana, YS Jagan case, transfer report

In twist in CBI Hyderabad JD Lakshminarayana, who is probing YSR Congress party president YS Jagan case, transfer report, he said that he has not recieved transfer orders.

నాకు ఉత్తర్వులు అందలేదు

Posted: 06/08/2013 05:04 PM IST
Twist cbi jd says not recieved transfer orders

ప్రముఖుల అక్రమాస్తుల కేసులలో కీలకపాత్ర పోషించి, వారి గుండెళ్లో రైళ్లు పరిగెత్తించిన సీబీఐ జాంయిట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ పదవి కాలం పూర్తి అయినందున ఆయనను మహారాష్ట్రకు బదిలీ చేస్తూ ఢిల్లీ నుండి ఉత్తర్వులు అందాయని, ఆయన స్థానంలో చెన్నై సీబీఐ జాయింట్ డైరెక్టర్ అరుణాచలంకి బాధ్యతలు అప్పగించబోతున్నారని ఈ నెల 11వ తేదీని లక్ష్మీనారాయణ మహారాష్ట్రకు వెళ్లి పోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్తల పై స్వయంగా లక్ష్మినారాయణే ట్విస్ట్ ఇచ్చారు. మహారాష్ట్రకు పోస్టింగ్ వచ్చినట్లు తనకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, మీడియా ద్వారానే విషయం తెలిసిందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈయన బదిలీ అవడంతో సంతోషంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్ వర్గానికి షాక్ తగిలినట్లయింది. ఇక అన్ని కేసులలో సీబీఐ పారదర్శకంగా వ్యవహరిస్తుందని, సీబీఐ ఎవరి ఒత్తిళ్ళకు తలొగ్గని స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles