Saraswati pushkarams at kaleswaram karimanagar dist

Kaleswaram, Saraswati Pushkarams, Karimnagar, Mukteswara Swamy Temple, Godavari River

saraswati pushkarams at kaleswaram karimanagar dist

సరస్వతి పుష్కరాలలో జనసందోహం

Posted: 06/09/2013 10:03 AM IST
Saraswati pushkarams at kaleswaram karimanagar dist

సరస్వతీ నదీ పుష్కరాలు రేపటితో పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు కరీం నగర్ జిల్లా  కాళేశ్వరంలో భక్తజన సందోహంతో క్షేత్రమంతా కిటకిటలాడుతోంది. 

భక్తుల సందర్శనానికి ఎండలు తగ్గి వాతావరణం అనుకూలం ఉండటం, వేసవి సెలవులు  కావటంతో వివిధ జిల్లాలనుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.  రద్దీని దృష్టిలో పెట్టుకుని చేసిన ఏర్పాట్ల వలన యాత్రికులు సజావుగా తమ పుణ్యకార్యాలను నెరవేర్చుకుంటున్నారు.  కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించేవారు, పెద్దలకు పిండప్రదానాలు చేసేవారు, గోదావరిలో పుణ్య స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకునేవారు పిల్లాపాపలతో పుణ్యక్షేత్రంలో పునీతులవటానికి వచ్చినవారితో క్షేత్రమంతా నిండిపోయివుంది. 

కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామి ఆలయం ఉదయం నుంచే  కిటకిటలాడుతోంది.  ఆలయంలోని కార్యకర్తలు అందరికీ దర్శనం కలిగేటట్టుగా భక్తులను నియంత్రిస్తున్నారు.  మే 30న మొదలైన పుష్కరాలు రేపు 10 వ తేదీతో పూర్తవబోతున్నాయి.  అయితే ఈ రోజు ఆదివారం అవటం వలన భక్తులు తండోపతండాలుగా కాళేశ్వరానికి చేరుకుంటున్నారు.  సరస్వతి అంటేనే చదువులతల్లి కాబట్టి విద్యార్థులను తీసుకుని వచ్చిన తల్లిదండ్రులు వారిచేత పుణ్యనదీ స్నానాలు చేయించి స్వామివారి దర్శనానికి తీసుకునివెళ్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles