Keshava rao join telangana rashtra samithi

Lok Sabha members, Telangana Rashtra Samithi, Congress, N Kiran Kumar Reddy

former PCC chief K Keshava Rao formally joined the Telangana Rashtra Samithi (TRS) at a public meeting held in Hyderabad on Sunday.Welcoming the Congress leaders into his party

కాంగ్రెస్ ను నమ్మకండి

Posted: 06/03/2013 09:07 AM IST
Keshava rao join telangana rashtra samithi

మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయిన కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా నిజాం కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేశవరావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన సీడబ్లూసీలో సభ్యుడిగా చేసిన అనుభవంతో చెబుతున్నా... కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు, కనుక ఆ పార్టీని నమ్మవద్దని, ఇంత కాలం నమ్మి మేం మోసపోయామని, ఇక ఆ పార్టీ నిర్ణయం తీసుకోదని, ఇంకా వేచి చూసే సమయం లేదని అన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న వెయ్యి మంది అమరుల ఆశయాల పూర్తికి కంకణం కట్టుకొని యుద్ధం చేస్తామని, ఇది ప్రజా ఉద్యమమని, ప్రజా యుద్ధంగా మారిందని, దీనికి కథా నాయకులు ఎవరైనా... రథ సారథులు లేనిదే ముందుకు సాగదు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ సాధించలేకపోయామని, ఈ విషయంలో నేను ఓడిపోయానని అన్నారు.  ఇప్పుడు తెలంగాణ అంతా ప్రజల చేతుల్లో ఉందని, ప్రజలకే ఎక్కువ అధికారం ఉందని, ప్రజల ఓటుతో తెలంగాణ సాధించుకుందామని అన్నారు. ఇంతకాలంగా కాంగ్రెస్ నాయకులుగా ఉన్న సీనియర్ నేతలు కేశవరావు,మందా జగన్నాధం, వివేక్ లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అయ్యారు. అయినా ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, దానినే నమ్ముకున్న కేశవరావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మకండని అనడం విడ్డూరంగా ఉందని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles