Case registered against ms dhoni in anantapur

mahendra singh dhoni, ipl spot fixing, indian cricket team captain mahendra singh dhoni, case registered against dhoni in anantapur, ipl spot fixing controversy

case registered against ms dhoni in anantapur

ధోనీపై అనంతపురంలో కేసు నమోదు

Posted: 06/03/2013 12:36 PM IST
Case registered against ms dhoni in anantapur

అసలే ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ తో క్రికెట్ పరువు పోతున్న రోజులు ఇవి. ఈ స్పాట్ ఫిక్సింగ్ పై సీనియర్ ఆటగాళ్లు చాలా మనస్థాపన చెందుతున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ ధోనీ మాత్రం మన ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ పాటించే సూత్రాన్ని పాటిస్తున్నారు. స్పాట్ ఫిక్సింగ్ ఎలాంటి కామెంట్ చెయ్యటలేదు. కానీ ఇప్పుడు ధోనీ మెడకు కొత్త కేసు చుట్టుకుంది. టీమిండియా కెప్టెన్ ధోనీపై అనంతపురం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓ వారపత్రికలో ధోనీని విష్ణుమూర్తిగా పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీహెచ్ పీ జనరల్ సెక్రటరీ శ్యాంసుందర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు వార పత్రిక ఎడిటర్, ధోనీపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. విష్ణు దేవుడి అవతారంలో ధోనీని చిత్రించి, ఒక చేతులతో బూట్లతో పాటు పలు వస్తువులను పట్టుకున్నట్లు ఓ బిజినెస్ మ్యాగజైన్‌పై అచ్చు వేయడం వల్ల హిందువుల దేవుడిని అవమానించారని, తద్వారా హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని హీరేమత్ ఆరోపించారు. ధోనీతో పాటు అప్పుడు ఆరుగురిపై కేసు నమోదైనట్లు సమాచారం. బిజినెస్ మ్యాగజైన్‌పై విష్ణువు అవతారంలో ధోనీ చిత్రాన్ని ప్రచురించడంపై ఇప్పటికే తీవ్ర వివాదం చెలరేగింది. క్రికెట్ అభిమానులు స్పాట్ ఫిక్సింగ్ చేసిన ఆటగాళ్లును ఛీదరించుకుంటున్నారు. అదే బాటలో ధోనీ నటించిన బిజినెస్ య్యాడ్ కు క్రికెట్ అభిమానులు, హిందువులు మండిపడుతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles