Trs reception meet

defectors entering trs, trs party public meet, nizam college grounds, k chandra sekhara rao, g vivek, manda jagannadham, k keshava rao

trs reception public meeting at nizam college grounds

తెరాస ఆహ్వన సభ

Posted: 06/02/2013 12:55 PM IST
Trs reception meet

తెలంగాణా రాష్ట్రసమితి ఈరోజు హైద్రాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది.  ముఖ్యంగా ఈ సభ పార్టీలో చేరబోతున్న ఇతర పార్టీలలోని నాయకులకోసం ఏర్పాటైంది. 

పార్టీలో చేరబోతున్న ముఖ్యనాయకులు- పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు వివేక, ఆయన తమ్ముడు వినోద్, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాధరావు, మాజీ పిసిసి అధ్యక్షుడు కె.కేశవరావు.

తెలుగుదేశం నాగర్ కర్నూల్ ఇన్ఛార్జ్ మర్రి జగన్నాధరెడ్డి కూడా తెరాసలో చేరబోతున్నారు.

ఇంకా తెరాసలో చేరబోతున్న నాయకులు- మెదక్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మాణిక్యరెడ్డి, తెలంగాణా వైద్యుల  ఐకాస నేత డాక్టర్ బూర నరసింహ గౌడ్, భువనగిరికి చెందిన వెంకట గౌడ్, హైద్రాబాద్ అంబర్ పేటకు చెందిన గుత్తేదార్ సుధాకర రెడ్డి. 

భారీగా జరుగుతున్న ఏర్పాట్లతో బహిరంగ సభ వేదిక కళకళ్ళాడుతోంది.  పార్టీలోకి అడుగుపెడుతున్న కొత్త నాయకులను వారి మద్దతుదారులతోపాటుగా ఆహ్వానించటం, పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా మాట్లాడటమే లక్ష్యంగా ఈ బహిరంగ సభ ఏర్పటైంది.

తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఎంతో చాకచక్యంతో ప్రణాళికాబద్ధంగా ఇతర పార్టీల నుంచి నాయకులను తన పార్టీలోకి రప్పించగలిగారు.  అందుకోసం పదవులను కూడా త్యాగం చెయ్యవలసి వచ్చింది.  ఆయన ఎర చూపించిన పదవులకోసం పార్టీలను వదిలిపెట్టారంటే అందుకు కారణం రాజకీయాలను సంపాదనకోసం పనిచేసే వృత్తిగా భావించటమే.  వృత్తి పరంగా ఎదగాలనుకునేవారు తమకు ఎదిగే అవకాశాలు ఎక్కడ లభిస్తే అక్కడకు చేరుకుంటారన్న విషయాన్ని బాగా కనిపెట్టిన కెసిఆర్ అటువంటి వారికి తగ్గట్టుగా ఆఫర్లనిచ్చి మరీ తన పార్టీలోకి తీసుకున్నారు.  వారికి ఆహ్వానం పలకటమే కాకుండా కెసిఆర్ విజయోత్సాహ వేడుకగా కూడా ఈ వేదిక పనిచేస్తుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles