Tihar jail registers record turnover

tihar jail, tihar jail registers record turnover, jail products, tihar jail in new delhi, registered a record turnover

Tihar jail registers record turnover, Tihar Jail in New Delhi registered a record turnover

ఆ జైలుకు భారీ పెరిగిన ఆదాయం

Posted: 05/20/2013 10:34 AM IST
Tihar jail registers record turnover

అది అతికిరాతుకులు ఉండే జైలు, దేశంలో ఉన్న ముఖ్య ఖైదీలకు ఆ జైలు ఒక నిలయం లాంటింది. జీవిత ఖైదీలు, మరణశిక్ష పడిన నేరగాళ్లు ఉండే జైలు. అయితే ఇప్పుడు ఆ జైలు కాసులు కురిపిస్తుంది. కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతుంది. 2012-13 సంవత్సరానికి గాను రూ.32.17 కోట్ల టర్నోవర్‌ సాధించామని, గత సంవత్సరం రూ 12.20 కోట్లతో పోలిస్తే ఇది రికార్డ్‌ ఆదాయమేనని జైలు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

జైలులోని వడ్రంగి పనుల విభాగంలోని ఖైదీలు ఈ సంవత్సరం రూ.23.14 కోట్ల ఆమ్మకాలు సాధించగా, బేకరీ విభాగం రూ.4.97 కోట్ల అమ్మకాలు సాధించాయని ఈ ప్రకటన తెలిపింది. తీహార్‌ జైలులో 12,000 మంది ఖైదీలు ఉంటున్నారు. న్యూఢిల్లిలోని ప్రభుత్వ పాఠశాలలకు డెస్కులు సరఫరా చేయడం ద్వారా జైలు కార్పెంటరీ విభాగం రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం పాఠశాలలకు సరఫరా చేసిన డెస్కుల సంఖ్య రోజుకు 225 నుంచి 400కు పెరగటం విశేషం.

బేకరీ ఉత్పత్తులు, దుస్తులు, గృహోపకరణాలు, చేనేత, రసాయనాలు, కాగితం తయారీ వాణిజ్యపరమైన ఆర్ట్‌ వర్క్‌ వంటి వస్తువులను తీహార్‌ జైలు ఖై దీలు తయారుచేస్తుంటారు. నిరంతరాయంగా ముడిసరకుల సరఫరా, బడ్జెట్‌ కేటాయింపుల పెంపు, కార్పెంటరీ విభాగంలో అదనంగా మౌలిక వసతులను కల్పించడంతో జైలులోని ఫ్యాక్టరీలు ఉత్పత్తిని బాగా పెంచగలిగాయి. వచ్చే సంవత్సరం ఆదాయం రూ.40 కోట్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీహార్‌ జైలు ఖైదీల ఉత్పత్తులను దేశరాజధానిలోని పలు రిటైల్‌ షాపుల్లో విక్రయిస్తుంటారు. ఖైదీలు ఆ జైలుకు కాసులు కురిపిస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles