Telangana congress mps set 30 may deadline

telangana congress mps, three telangana congress mps, deadline, party high command, separate telangana state, telangana congress mps s rajaiah, manda jagannatham, g vivek, telangana issue, aicc spokesperson pc chaco, chacko, aicc vice-president rahul gandhi

telangana congress mps set 30 may deadline

రాష్ట్రంలో మళ్లీ డెడ్ లైన్ గేమ్ ?.?

Posted: 05/20/2013 10:55 AM IST
Telangana congress mps set 30 may deadline

రాష్ట్రంలో మళ్లీ డెడ్ లైన్ గేమ్ మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ డెడ్ లైన్ విధించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, అయితే ఈ డెడ్ లైన్ పేరు విని రాష్ట్ర ప్రజలు భయంపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు విధిస్తూ ముగ్గురు టి.కాంగ్రెస్‌ ఎంపీలు అధిష్టానానికి హెచ్చరిక చేశారు.

పార్లమెంట్‌ సభ్యులు వివేక్‌, మందా జనగ్నాథం, రాజయ్యలు హైదరాబాద్‌లోని ఎంపీ వివేక్‌ నివాసంలో వారు సమావేశమయ్యారు. సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కే కేశవరావు కూడా హాజరయ్యారు. సమావేశానంతరం మందా జగన్నాథం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఈనెల 30 లోగా కేంద్రం ఒక నిర్ణయానికి రాని పక్షంలో తాము పార్టీని వీడి పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

పార్టీ జాతీయ ఎజెండాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన లేదంటూ జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా ఖండించారు. ఇటువంటి ప్రకటనలు తెలంగాణ ప్రజలను అవమానించడమేనని జగన్నాథం అన్నారు. ఈ విషయమై చాకో క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఎన్నో గడువులు విధించామని ఈనెల 30 చివరి గడువుగా ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా, ఎంపీలు వివేక్‌, మందా జగన్నాథం, రాజయ్యలు ఈమేరకే టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అధిష్టానం ఈ విషయాన్ని పరిశీలించి తెలంగాణపై ఒక నిర్ణయాన్ని తీసుకునేంతవరకు వేచివుండాలని ఎంపీలను కోరినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలోని ఇతర ఎంపీల అభిప్రాయం ఏవిధంగా ఉందన్న ప్రశ్నకు మందా జగన్నాథం సమాధానం ఇస్తూ అది వారికి సంబంధించిన విషయంగా పేర్కొన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles