Chiranjeevi lays foundation for vizag mega carridor project

vizag mega carridor project, chiranjeevi, c ramachandraiah, ganta srivasarao, botsa satyanarayana, t subbiramireddy, vatti vasanta kumar

chiranjeevi lays foundation for vizag mega carridor project

విశాఖ మెగా కారిడార్ కి చిరంజీవి శంఖుస్థాపన

Posted: 05/05/2013 09:54 AM IST
Chiranjeevi lays foundation for vizag mega carridor project

కేంద్ర పర్యాటక శాఖామాత్యులు చిరంజీవి విశాఖ-భీమిలి మెగా కారిడార్ ప్రాజెక్ట్ కు భీమీలి లో శంఖస్తాపన చేస్తూ, విశాఖకు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఖ్యాతి లభిస్తుందని అన్నారు.  కేంద్ర మంత్రిగా ఉన్న తను రాష్ట్రాన్ని కూడా పర్యాటక రంగంలో ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తానని మాటిస్తూ, ఈ మెగా కారిడార్ ప్రాజెక్ట్ కి ప్రభుత్వం నుంచి 45 కోట్ల రూపాయలను కేటాయించటం జరిగిందన్నారు.

ఈ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నం లోని ప్రముఖ బీచ్ లైన ఆర్ కె బీచ్, ఋషికొండ బీచ్, భీమిలీ బీచ్ లతో పాటుగా పర్యాటక స్థలాలైన కొండలు కైలాసగిరి, తొట్లకొండ, బావి కొండలను, ఎర్ర మట్టి దిబ్బలను అభివృద్ధి చేయనున్నారు.  ఈ ప్రాజెక్ట్ కి కాలవ్యవధిని కూడా 18 నెలలుగా నిర్ణయించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖా మంత్రి రామచంద్రయ్య, రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని చిరంజీవి, బొత్సా తమ కృషితో ముందుకు తీసుకెళ్తారంటూ ప్రశంసించారు.  కార్యక్రమంలో బొత్సా సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంతకుమార్, మంత్రులు గంటా శ్రీనివాసరావు, సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles