Viiolence in kakinada aditya engg college

violence in aditya engg college, aditya engineering college kakinada, clash between bihar, andhra students, 12 wounded in aditya engg college clashes

viiolence in kakinada aditya engg college

ఇంజినీరింగ్ కాలేజ్ లో గొడవలు

Posted: 05/01/2013 12:34 PM IST
Viiolence in kakinada aditya engg college

కాకినాడ సమీపంలో సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ లో రెండు రోజులుగా జరుగుతున్న అల్లర్ల విషయంలో వివరాలు పూర్తిగా బయటకు చెప్పటానికి పోలీసులు కానీ కాలేజ్ యాజమాన్యం కానీ ముందుకు రావటంలేదు.  రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవటం, కాలేజ్ లో అంతా ధ్వంసం చెయ్యటం చేస్తున్నారు.  ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసామని మాత్రం చెప్తున్నారు. 

12 మంది విద్యార్థులు బాగా గాయపడ్డారని, అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అనధికారికంగా తెలిసింది. అనధికారికంగానే తెలిసిన ఘటనకు  కారణం ఇది- ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ లో బీహార్ నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.  ఆరు నెలల క్రితం బీహారీ అమ్మాయికి, తెలుగు అబ్బాయి కి మధ్య కలిగిన సాన్నిహిత్యం గొడవలకు కారణమైంది.  బీహార్ విద్యార్థులు అందుకు అభ్యంతరం తెలియజేస్తూ, అమ్మాయిని అబ్బాయినీ కూడా విడివిడిగా హెచ్చరించారు.  అయితే వాళ్ళు వినిపించుకోకుండా తమ దారిన తాము స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు.  మొన్న బిహారీలు గట్టిగా హెచ్చరించటంతో మొదలైన గొడవ, తెలుగు, బీహార్ విద్యార్థి బృందాల మధ్య రగిలి చివరకు హింసకు దారితీసింది. 

ఇన్ స్పెక్టర్ భరత్మాతాజీ చెప్పిన ప్రకారం కాలేజ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు విద్యార్థుల మీద ట్రెస్ పాసింగ్ కి సెక్షన్ 448, మహిళ మీద అసభ్యంగా మాట్లాడినందుకు సెక్షనం 509, ఆస్తికి నష్టం కలిగేలా ప్రవర్తించినందుకు సెక్షన్ 427లను నమోదు చేసారు. 

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles