Cm on on election campaign in karnataka

cm karnataka campaign, cm kiran kumar reddy, raghuveerareddy, tg venkatesh, ganga bhavani, pongueti sudhakar reddy

cm on on election campaign in karnataka

కర్నాటకలో సిఎమ్ రెండవరోజు ప్రచారం

Posted: 05/01/2013 02:21 PM IST
Cm on on election campaign in karnataka

కర్నాటకలో ఎన్నికల సందర్భంగా అక్కడి తెలుగువారిని ప్రభావితం చెయ్యటం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సుడిగాలి పర్యటనలో నాలుగు నియోజకవర్గాలకు వెళ్ళి నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు.    బెంగళూరు విమానంలో చేరుకున్న కిరణ్ కుమార్ కి అక్కడ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. 

బెంగళూరు సివి రామన్ నగర్ లో ఆ నియోజక వర్గ అభ్యర్థి రమేష్ తో కలిసి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు.  తర్వాత అనెకల్ లో అభ్యర్థి శివన్న కోసం ప్రచారం చేసారు.  అలాగే కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన జయ నగర్ లో వేణు గోపాల్ కోసం, బసవన్న గుడిలో చంద్రశేఖర్ కోసం ప్రచారం చేసారు. 

ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశంలో సమైక్యత స్థాపించబడుతుందని, సర్వతోముఖమైన అభివృద్ది కలుగుతుందని చెప్తూ, ఒకపక్క కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటే మరోపక్క భారతీయ జనతా పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు.  కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా కిరణ్ కుమార్ రెడ్డి వోటర్లను అభ్యర్థించారు.

కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎన్నికల ప్రచారానికి మంత్రులు రఘువీరా రెడ్డి, టి.జి.వెంకటేష్, శాసనపక్ష సభ్యుడు ఎమ్.రంగారెడ్డి, ఎఐసిసి సెక్రటరీ పొంగులేటి సుధాకరరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధినేత్తి గంగాభవాని తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

నిన్న బెంగళూరులో తెలుగు మాట్లాడేవారున్న ప్రదేశాల్లో ప్రచారానికి వెళ్ళిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కూడా ప్రచారం చేస్తున్నారు.  అందులో భాగంగా హోటల్ వెస్టెండ్ లో తెలుగు సంఘాల నాయకులతో సమావేశం కానున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles