Ntr statue to be unveiled at parliament by speaker

ntr statue for parliament, nt rama rao, telugu desam party, parliament speaker, meira kumar, acharya n g ranga, tanguturi praksasam pantulu, telugu talli, annamacharya

ntr statue to be unveiled at parliament by speaker

ఢిల్లీకి వెళ్తున్న ఎన్టీఆర్ విగ్రహం

Posted: 05/01/2013 11:47 AM IST
Ntr statue to be unveiled at parliament by speaker

9 అడుగుల 3 అంగుళాల ఎన్ టి రామారావు కాంస్య విగ్రహం ఢిల్లీ లో పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్టాపనకు బయలుదేరి వెళ్తోంది.  మే 7న పార్లమెంట్ స్పీకర్ మీరా కుమార్ చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కరించబడుతుంది. 

కంచు, రాగి, గన్ మెటల్ ని ఉపయోగించి 6 నెలలు పైగా శ్రమించి దివంగత నేత,  మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని తీర్చిదిద్దారు గుంటూరు జిల్లా వేమూరు గ్రామానికి చెందిన దేవు శంకర్, అతని కుమారులు కలిసి.  లోగడ ఆచార్య ఎన్.జి.రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను కూడా దేవు శంకర్ చెక్కగా వాటిని పార్లమెంటులో ప్రతిష్టించారు.  కానీ దేవు శంకర్ కి ఎన్టీఆర్ విగ్రహం చాలా విశేషమైనది.  హైద్రాబాద్ సికిందరాబాద్ లను కలిపే టాంక్ బండ్ మీద ప్రతిష్టించిన అన్నమాచార్య, తెలుగు తల్లి విగ్రహాలను ఎన్టీఆర్ స్వయంగా పురమాయించారు.  ఆ సమయంలో ఎన్టీఆర్ తో కలిగిన సాన్నిహిత్యం వలన ఆయన విగ్రహం దేవు శంకర్ కి ప్రత్యేకతను సంతరించుకుంది.  ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ తో సమయం దొరకటం కష్టమైన రోజుల్లో కూడా ట్యాంక్ బండ్ మీది విగ్రహాల కోసం ఆయన తనతో రెండు గంటలు గడిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు దేవు శంకర్. 

విగ్రహాన్ని తయారు చెయ్యటానికి పూనుకునేముందు విగ్రహం మోడల్ ని తయారు చేసి ఎన్టీఆర్ కుటుంబీకులకు చూపించి వారి ఆమోదం పొందిన తర్వాతనే ఈ విగ్రహాన్ని తయారుచెయ్యటానికి ఉపక్రమించామని దేవు శంకర్ తెలియజేసారు.

900 కిలోల బరువున్న ఈ విగ్రహం నిన్న దుర్ముహూర్తం దాటిపోయిన తర్వాత తరలించటానికి ఉపక్రమిస్తున్నామని శంకర్ తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles