పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలును రెచ్చగొట్టి పంపుతున్నారు. అయితే అలాంటి వారి పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని బొత్స చెప్పారు. అయితే కొంత మంది కావాలనే దొంగ దీక్షలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పేద- మద్యతరగతి వారికి కోసం ప్రత్యేక రాయితీలు కల్పించటం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు తన పబ్బం గడుపుకోవటానికి కావాలని రాద్దాంతం చేస్తూ .. సొంత మీడియాలో చప్పట్లు కొట్టుకుంటున్నాయి. అలాంటి పార్టీలకు ప్రజలే బుద్ది చెబుతారని బొత్స ఆవేశంగా అన్నారు. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజయవాడలో వెల్లడించారు. ఈ అంశంపై ఇప్పటికే స్పీకర్‑కు లేఖ రాసినట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించినా విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని ఆయన విపక్షాలపై మండిపడ్డారు. వస్త్రాలపై వ్యాట్‑ రద్దు చేయాలనే వస్త్రవ్యాపారుల డిమాండ్ సీఎం దృషికి తీసుకు వెళ్తామని ఆయన వస్త్రవ్యాపారులకు హామీ ఇచ్చారు. చిన్న వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. చట్టాన్ని ధిక్కరించి వ్యాపారం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని బొత్స సత్యనారాయణ వ్యాపారస్తులను హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more