Konathala ramakrishna comment on jr ntr flexi

ysrcp leader konathala ramakrishna, konathala ramakrishna, junior ntr flexi, junior ntr photo, jr ntr should respond on flexi issue, balakrishna, tdp, ysrcp,

konathala ramakrishna comment on jr ntr flexi

జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో మా పార్టీకి సంబంధం లేదు?

Posted: 04/07/2013 01:59 PM IST
Konathala ramakrishna comment on jr ntr flexi

రాష్ట్రంలో  ఉన్న రాజకీయ పార్టీల మద్య  పోస్టర్ వార్ జరుగుతుంది.  పార్టీల నాయకులు  ఒకరి మీద ఒకరు మాటల యుద్దం చేసుకుంటున్నారు.  అయితే  దీనికి సంబందించిన ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి   ప్రకటన చేయలేదు. కానీ,  వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ మాత్రం  జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలకు, మా పార్టీ ఎలాంటి సంబంధం లేదని తెల్చిపారేసింది. దీంతో టిడిపి నాయకులు శాంతించారు. ఫ్లెక్సీలపై ఎన్టీఆర్‑ ఫోటోతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ హైదరాబాద్‑లో వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న పురంధేశ్వరి ఎన్టీఆర్ ‑ఫోటోతో ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హీరో బాలకృష్ణకు కొణతాల ఈ సందర్భంగా సూచించారు. విపక్షాలు చేపట్టిన విద్యుత్ ఆందోళనలపై ఈ ప్రభుత్వం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.  ప్రభుత్వానికి ఏమాత్రం ముందు చూపులేదని అన్నారు. దొడ్డిదారిన వచ్చిన నాయకులకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. సీఎం కిరణ్‑కు కుర్చీ కాపాడుకోవడానికే సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం వల్ల పరిశ్రమలు మూతపడే పరిస్థితి దాపురించిందని కొణతాల ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles