Delhi gang rape an eye opener says pm

delhi gang rape, prime minister, dr manmohan singh, state chief ministers

delhi gang rape an eye opener says pm

న్యాయవ్యవస్థ అభివృద్ధికి మరిన్ని నిధులు

Posted: 04/07/2013 04:20 PM IST
Delhi gang rape an eye opener says pm

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో న్యాయవ్యవస్థ లోని సమస్యలమీద పరిష్కారం కోసం ఢిల్లీలో జరిగే సమావేశాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. 

ఈ సందర్భంలో మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థలో మహిళల రక్షణకోసం మరింత పటిష్టమైన నిర్ణయాత్మకమైన మార్పుల అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి అన్నారు.  చేసింది చాలదు, ఇంకా ఎంతో చెయ్యాలన్న విషయాన్ని ఢిల్లీ లో జరిగిన సామూహిక అత్యాచారం తెలియజేస్తున్నదని ఆయన అన్నారు.  సమాజంలో అబలలైన మహిళలు, వయసు మళ్ళినవారి విషయంలో సత్వర న్యాయం చేకూర్చటానికి ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించటానికి ఇంకా జడ్జ్ ల నియామకం అవసరమని, న్యాయవ్యవస్థలో అభివృద్ధి కోరుతూ, సబార్డినేట్ జడ్జిల నియామకం కోసం రాష్ట్రాలకు మరిన్ని నిధులను కేటాయిస్తామని మన్మోహన్ సింగ్ మాటిచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles