Midnight suitable for disrupting fastings

ys vijayamma, ysr cong party, fasting of vijayamma, disruption of fasting, nims hospital

midnight suitable for disrupting fastings

దీక్షాభంగాలకు అనువైన సమయం

Posted: 04/07/2013 09:14 AM IST
Midnight suitable for disrupting fastings

విద్యుత్ ఛార్జీల పెంపు కి ప్రభుత్వం పట్ల నిరసన ప్రకటిస్తూ ఓల్డ్ ఎమ్మల్యే క్వార్టర్స్ లో నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యలను అర్ధరాత్రి పోలీసులు దీక్షాభంగం చేసారు. 

తేదీ దాటటమే కాకుండా అర్ధరాత్రికి మరో ప్రత్యేకత ఉంది.  అందరూ నిద్రించే సమయం కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్రతిఘటనలను కోరుకోదు.  ఏం జరుగుతోందో తెలిసేటప్పటికే పరిస్థితి చెయిదాటిపోతుంది.  అందువలన అలాంటి సమయం పోలీసులకు అనువుగా ఉంటుంది.  వాళ్ళని తరలించటానికి ట్రాఫిక్ అడ్డంకులేమీ ఉండవు.  చల్లపూట పని చల్లగా సాగిపోతుంది. 

తెలుగు దేశం పార్టీ ఎమ్మల్యేలను కూడా అలాగే అర్ధరాత్రి దీక్షా భంగం చేసి హాస్పిటల్ కి తరలించారు.  భాజపా విషయంలో మరీ రాత్రి వరకు ఆగలేదు కానీ, వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షను మళ్ళీ అర్ధరాత్రి భంగం చేసారు.  ఐదు రోజులవటంతో ఇలాంటిదేదో చేస్తారని ఊహించిన కార్యకర్తలు సిద్ధంగానే ఉన్నారు.  అందువలన పోలీసులకు, కార్యకర్తలకు మధ్య కాసేపు తోపులాట జరిగింది కానీ పోలీసులు చెయ్యి ఎలాగూ పైనే ఉంటుంది కాబట్టి, వారి సామర్థ్యాన్ని కొలమానం కూడా అదే కాబట్టి, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విజయమ్మ, దీక్షలో పాల్గొన్న ఇతర నాయకులను హాస్పిటల్ కి తరలించారు. 

దీక్ష ఐదు రోజులు దాటుతుండటం, దీక్షలో పాల్గన్నవారి ఆరోగ్యాలు క్షీణిస్తుండటంతో సభాపతి నాదెండ్ల మనోహర్ వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా వారి దీక్షలను భంగం చేసి వారిని హాస్పిటల్ కి తరలించమని ఆదేశాలివ్వటంతో పోలీసులు ఆ పనిని నెరవేర్చారు. 

ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేసారు.  ఆందోళన చేస్తున్న కార్యకర్తలను ముందు అరెస్ట్ చేస్తేనే కానీ నేతలను తరలించలేకపోయారు.  ఈ పరిస్థితిని ముందే ఊహించిన పోలీసులు భారీ బలగాలతో దీక్షాస్థలికి వెళ్ళారు.  ముగ్గురు డిసిపిలు, ముగ్గురు ఎసిపిలు ఇందుకు సారధ్యం వహించారు.  ఆంబులెన్స్ లో నేతలను నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. 

నిమ్స్ కి చేరుకున్న తర్వాత ఈ రోజు ఉదయం విజయమ్మ దీక్షను విరమించారు.

-శ్రీజ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles