Men fighting against violence against women

shakti vahini ngo, vital voices global leadership, kennedy centre, solidarity award

men fighting against violence against women got honored

shakti-vahini.png

Posted: 04/03/2013 10:33 AM IST
Men fighting against violence against women

ravi-kant

మహిళలమీద హింసకు వ్యతిరేకంగా పోరాడుతూ మహిళల భధ్రతకోసం పాటుపడుతున్న భారతీయ యువకులకు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక వైటల్ వాయిసెస్ గ్లోబల్ లీడర్ షిప్ పురస్కారం లభించింది.

శక్తి వాహిని అనే పేరుతో స్వచ్ఛంద సేవా సంఘాన్ని స్థాపించిన రవి, ఋషి, నిషి కాంత్ లకు నిన్న కెనడీ సెంటర్ లో జరిగిన వార్షిక కార్యక్రమంలో 2001 సంవత్సరానికి మహిళల పట్ల జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం సలుపుతున్న శక్తివాహినికి సాలిడారిటీ అవార్డ్ ప్రదానం జరిగింది.

సుప్రీం కోర్టు అడ్వకేట్, శక్తివాహిని అధ్యక్షుడైన రవి కాంత్ మాట్లాడుతూ, స్త్రీ అభ్యుదయం కోసం పురుషులు పోరాడటమనేదాన్ని స్త్రీలు అంగీకరించటం కాస్త కష్టమైన విషయమనే అనిపించినా కానీ మేము పనిచేస్తూ పోయాము. అందుకు ఫలితంగా మాకు మహిళా సంఘాల నుంచి మద్దతు లభించిందన్నారు.

కేవలం అత్యాచారాలే కాకుండా, మహిళలతో బలవంతంగా వ్యభిచారాలను చేయించేవారి నుండి కూడా వాళ్ళకి విముక్తి కలిగించటం జరిగింది. అత్యాచారాలకు బలయ్యే వారు ఎవరైనా కావొచ్చు. మా సోదరే కావచ్చు, మా కూతురు కావొచ్చు. ఆడవాళ్ళు మన సమాజంలో సగ భాగం. అంతేకాదు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నవారు. కుటుంబాలను నడిపేది వాళ్ళే, పిల్లలను కనిపెంచి పెద్ద చేసేది వాళ్లే. ఇలా తమ సోదరులు వేదిక మీద గుర్తింపుని పొందటం వలన సమాజంలో మహిళల కోసం పాటుపడే సోదరీమణులు కూడా చేయూత నిస్తారని ఆశిస్తున్నామన్నారు రవికాంత్.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Case against lanco hills management
Spiritual guru behind bsp leader bhardwaj murder  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles