Spiritual guru behind bsp leader bhardwaj murder

deepak bharadwaj, bahujan samaj vadi party, deepak bharadwaj murder, spiritual guru, bahadurgarh

spiritual guru behind bsp leader bhardwaj murder

bharadwaj-murder.png

Posted: 04/03/2013 09:53 AM IST
Spiritual guru behind bsp leader bhardwaj murder

deepak-bhardwaj

బహుజన్ సమాజ్ వాది పార్టీ నాయకుడు దీపక్ భరద్వాజ్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు ముందడుగు వేసామని చెప్తున్నారు. మార్చి 26 న దక్షిణ ఢిల్లీలో జరిగిన దీపక్ భరద్వాజ్ హత్య కేసులో ఇంతవరకు నలుగురిని అరెస్ట్ చేసారు.

కిరాయి షార్ప్ షూటర్స్ సునీల్ మాన్, పురుషోత్తమ్ రానా లను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు వాళ్ళ ద్వారా భరద్వాజ్ హత్య వెనుకనున్న సత్యాలను రాబడుతున్నామని అన్నారు. ముఖ్యంగా ఈ కిరాయి హంతకులకు 50 లక్షలు, ఒక కోటి రూపాయలను ఇచ్చి హత్యచేసే పనిని అప్పగించిన ఒక ఆధ్యాత్మిక గురువు ఆచూకీ తెలిసింది. ఆయన పేరు చెప్పలేదు కానీ ఆయన ఒక ఆధ్యాత్మిక గురువని, బహదూర్ గఢ్ కి చెందినవారని చెప్పారు.

నిందితుడిగా పేర్కొంటున్న ఆ ఆధ్యాత్మిక గురువు వివిధ రకాలుగా ఎంతో భూమిని సొంతం చేసుకున్నారట. భూమి విషయంలోనే భరద్వాజ్ తో వివాదం వచ్చిందని తెలుస్తోంది. పోలీసులు ఆ గురువునింకా అదుపులోకి తీసుకులేదు కానీ కేసులో ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అసలు కీలకమైన వ్యక్తి ఆ గురువేనా లేకపోతే ఇంకా ఎవరైనా ఆయన వెనకాల ఉండి కథను నడిపిస్తున్నారా అన్న దిశగా కూడా దర్యాప్తు జరుగుతోంది.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Men fighting against violence against women
Party changed but scene continues  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles