Indian counter resolution to pak

indian parliament, resolution against pakistan resolution, pakistan national assembly

indian counter resolution to pak

india-resolution.png

Posted: 03/16/2013 10:53 AM IST
Indian counter resolution to pak

 meera-kumar

పాకిస్తాన్ ప్రభుత్వం నేషనల్ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం పట్ల భారత దేశంలో ప్రతిపక్షాలు చేసిన ఆందోళనకు స్పందించిన భారత ప్రభుత్వం నిన్న పార్లమెంటులో పాస్ చేసిన రిజల్యూషన్ ఇలా ఉంది-

మార్చి 14 న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పాస్ చేసిన రిజల్యూషన్ ని పూర్తిగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్ ప్రభుత్వం తమ భూభాగంలో భారత్ మీద ఉగ్రవాద దాడుల తయారీలకు ఆస్కారమివ్వదన్న హామీయే పాకిస్తాన్ తో శాంతియుతమైన సంబంధాలకు హేతువవుతుంది.

భారత దేశానికి సంబంధించిన అంతర్జాతీయ వివాదాలలో పాకిస్తాన్ తలదూర్చటాన్ని, ఉగ్రవాదానికి చేయూత నివ్వటాన్ని భారత్ సహించదు.

జమ్మ కాశ్మీర్, అందులో చట్టవ్యతిరేకంగా ఆక్రమించుకున్న భూభాగంతో సహా అంతా భారత దేశానికి చెందినదే, భారత దేశంలోని అంతర్భాగమే. అటువంటి భారత ఆంతరంగిక వ్యవహారాలలో కలుగజేసుకుంటే అందుకు దీటుగా అఖండ భారతదేశం ఐకమత్యంతో తీసుకునే ప్రతిచర్యలుంటాయి.

ప్రతిపక్షాలు ఆందోళన చెయ్యటమూ సబబే, దేశవాసులందరికీ బాధ కలిగించటమూ సరైనదే, ప్రభుత్వం పార్లమెంటులో తీసుకున్న నిర్ణయం శ్లాఘనీయమే. కానీ ఇలాంటి రిజొల్యూషన్ వలన ఏమౌతుంది అని అడిగేవారూ ఉన్నారు. అంతకు ముందుకూడా ఇలాంటి రజోల్యూషన్ లు పాస్ చేసారు ఏమిటి దాని ఫలితం అని ప్రశ్నించేవారూ ఉన్నారు. పోయిన నెలలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సమర్థించటం మానెయ్యాలి, భారత్ కి వ్యతిరేకంగా అక్కడ ఉగ్రవాద శిక్షణలకు స్వస్తి చెప్పాలంటూ కోరింది. కానీ పరిస్థితుల్లో తేడా ఏమీ రాలేదు కదా అంటారు.

కానీ ఇది కనీస ధర్మం. భారత దేశ వాసుల హృదయ నాడిని పార్లమెంటులో స్పందింపజేసారు. బాధ కలిగినప్పుడు పరామర్శిస్తే ఏమవుంది అని అంటే ఏం చెప్తారు. నేనున్నాను, మీ బాధలో పాలుపంచుకుంటున్నాను అని చెప్పటమనేది మానవత్వం. అలాగే, బాధ కలిగించిన వారి చర్యలను ఖండిస్తున్నామనటం కూడా అవసరమే. పద్ధతి మార్చుకోకపోతే పాకిస్తాన్ తో సంబంధాలను తెగతెంపులు చేసుకుంటామని అనటం కన్నా ప్రస్తుతం చేసేది ఏముంటుంది. సినిమా కాదు కదా వెనువెంటనే యుద్ధానికి కాలు దువ్వటానికి. జాతీయ అంతర్జాతీయ కట్టుబాట్లను ఎన్నిటినో పాటించవలసి వుంటుంది.

శత్రు దేశాలను దీటుగా ఎదుర్కోవాలంటే కావలిసింది ఐకమత్యం కానీ ఒకరినొకరు విమర్శించుకుంటూ కాలాన్ని వెళ్ళదీయటం కాదు. దేశంలో అంతర్గత కలహాలు, బలహీనతలే శత్రు దేశాలకు బలం చేకూరుస్తుందని తెలుసుకోవాలి. రిజొల్యూషన్ వలన ఏమౌతుంది అని అంటే, పాకిస్తాన్ చేసింది కూడా రిజొల్యూషన్ కదా!

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles