Nirbhay father refuses to take back fees from institute

delhi gang rape victim, sai institute, physio therapy, poor students scholarship

nirbhay father refuses to take back fees from institute

nirbhaya-fees.png

Posted: 03/14/2013 11:42 AM IST
Nirbhay father refuses to take back fees from institute

ఢిల్లీ లో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ (అసలు పేరు కాదు) కుటుంబ సభ్యులకు సాయి ఇన్స్ స్టిట్యూట్ ఫీజు మొత్తాన్ని తిరిగిచ్చేయటానికి నిర్ణయించుకుంది.  అయితే దాన్ని తిరస్కరించిన ఆమె కుటుంబ సభ్యులు, ఆ మొత్తాన్ని పేదల విద్య కోసం వినియోగించమని కోరారు.  

నాలుగు సంవత్సరాల ఫిజియో థెరపీ కోర్సు చేసిన నిర్భయ కదులుతున్న బస్సులో అత్యాచారానికి గురై మృత్యువుతో పోరాడి చివరకు సింగపూర్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.  ఆ కేసులో ప్రధాన నిందితుడు తిహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

సాయి ఇన్స్ స్టిట్యూట్ లో ఆఖరు సంవత్సరం ఆమె మార్కుల షీట్ ను తీసుకోవటానికి కొడుకుతో పాటుగా విద్యా సంస్థకి వెళ్ళిన నిర్భయ తండ్రి మార్క్స్ షీట్ లో కూతురికి వచ్చిన 73 శాతం మార్కులను చూసి ఆనందపడ్డారు.  శిక్షణ కోసం ఆయన విద్యాసంస్థకు చెల్లించిన 1 లక్ష ఎనభైవేల రూపాయలను ఆ సంస్థ డైరెక్టర్ హరీష్ అరోడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పగా దాన్ని తిరస్కరిస్తూ, ఆ మొత్తాన్ని పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్ కోసం వాడమని ఆయన కోరారు.  

మేము బతికున్నంతకాలం ఈ బాధ మమ్మల్ని వెంటాడుతూనే వుంటుంది కానీ మా అమ్మాయి అందరికంటే మంచి మార్కులు తెచ్చుకున్నందుకు గర్వంగా ఉందని నిర్భయ తండ్రి అన్నారు.  విద్యా సంస్థ ఇస్తానంటున్న ఫీజు పేద విద్యార్థులకు ఉపయోగపడితే తన కూతురు ఆత్మకు శాంతి కలుగుతుందని ఆయన అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  External affairs minister meets pm on italian mariners issue
Ap assembly adjourned for one hour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles