External affairs minister meets pm on italian mariners issue

italian mariners, indo italian relationship, prime minister, external affairs minister,fishermen killed by mariners

external affairs minister meets pm on italian mariners issue

italy-issue.png

Posted: 03/14/2013 12:05 PM IST
External affairs minister meets pm on italian mariners issue

 

italian-mariners-issueఇటలీ ప్రభుత్వం నిందితులైన వారి నావికా అధికారులను భారత్ కి అప్పజెప్పటానికి నిరాకరించిన నేపథ్యంలో భారత్ తీసుకోవలసిన చర్య ఏమిటన్నదానిలో చర్చించటానికి భారత విదేశాంగ శాఖామాత్యులు సల్మాన్ ఖర్షీద్ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో ఆయన నివాసంలో ఈరోజు భేటీ అయ్యారు.   

కేరళ సముద్ర జలాలలో మత్స్యకారులను కాల్చి చంపిన నేరంలో అదుపులోకి తీసుకున్న ఇటలీ నావికా అధికారులను ఇటలీ భారత్ కి పంపించటానికి అంగీకరించకపోవటాన్ని తప్పు పట్టిన ప్రధాన మంత్రి నిన్న ఇటలీ ప్రభుత్వాన్ని అందుకు పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

విచారణలు తాము మత్సకారులను చంపినట్టుగా అంగీకరించిన నావికా అధికారులను ఒక సారి క్రిస్ట్ మస్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోవటం కోసం, మరోసారి ఎన్నికలలో ఓటు హక్కుని వినియోగించుకోవటం కోసం ఫిబ్రవరి ఇటలీకి వెళ్ళనిచ్చిన భారత ప్రభుత్వం, మొదటి సారి లాగానే తిరిగి నాలుగు వారాల గడువులో పంపిస్తారనుకుంటే, ఇటలీ అందుకు నిరాకరించింది.  భారత్ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇందులో వర్తించవని, అంతర్జాతీయ న్యాయస్థానమే అందుక అర్హమైనదని సాంకేతిక వంకలను చూపుతూ ఇటలీ, నావికా అధికారులను పంపించమన్న భారత్ అభ్యర్థనను తోసిపుచ్చింది.  

ఈ విషయం మీద కేంద్రంలో ఉభయసభలలోనూ ఆందోళనలు చెలరేగాయి.  దానితో ప్రధాన మంత్రి ఇటలీని తీవ్ర స్థాయిలో మందలించారు.  మీ నిర్ణయం మాకు సమ్మతం కాదు, నేరస్తులనిద్దరినీ భారత్ కి విచారణకు పంపించండి అని గట్టిగా చెప్పారు.  

చెప్పటాలు, హెచ్చరించటాలు, సంబంధాలు తెగిపోతాయని  బెదిరించటాలూ అయిపోయాయి.  ఇటలీ తను చెయ్యదలచుకున్నది చేసి, చెప్పదలచుకున్నది చెప్పి మాట్లాడకుండా ఊరుకుంది.  ఇప్పుడ మనం ఏం చెయ్యాలి అన్నదానిలో సరైన నిర్ణయానికి రావటం కోసం సల్మాన్ ఖుర్షీద్ ప్రధాన మంత్రితో చర్చించటానికి ఈరోజు వెళ్ళారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  60 fishermen arrested by srilankan navy
Nirbhay father refuses to take back fees from institute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles