ఈ రోజు శాసనసభలో తెరాస సభ్యులు తెలంగాణా గురించి సభలో చర్చిస్తూ సభాపతి దగ్గరకు పోయి ఆందోళన కొనసాగించటంతో సభ గంట సేపు వాయిదా పడింది. సభ్యులను సభను సజావుగా సాగించేందుకు సహకరించమని సభాపతి చేసిన విఙప్తి ని వారు వినకపోవటంతో సభ వాయిదా వెయ్యవలసివచ్చింది.
విపక్షాలు అవిశ్వాస తీర్మానం దిశగా కదుపుతున్న పావులను గమనించిన ముఖ్యమంత్రి అక్కడ అందుబాటులో ఉన్న మంత్రులతో మంతనాలు జరిపారు.
భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, నాగం జనార్దన రెడ్డి తో కలిసి తెలంగాణా రాష్ట్ర సమితి మొత్తం 25 సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసుని సభాపతికి అందజేసింది.
ఈ విషయంలో మాట్లాడుతూ ఈటెల రాజేందర్, ధరల నియంత్రణలోనూ విద్యుత్ సరఫరా లోనూ ప్రభుత్వ వైఫల్యం వలన సామాన్య ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారని, ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని, అందువలన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అన్ని శక్తులనూ వొడ్డి ప్రయత్నిస్తామని చెప్తూ, ఇందులో తెలుగు దేశం పార్టీకూడా తోడుగా ఉంటే చాలా బావుండేదని, రాజకీయ దృష్టితో ఆలోచించకుండా తెలుగుదేశం పార్టీ సహకరించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
వాయిదా పడ్డ సభ 10 గంటలకు తిరిగి ప్రారంభమైంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more