Precautions to be taken in bomb fearing cities

hyderabad bomb blast, terrorist activities, bomb scare, terrorist prone areas

precautions to be taken in bomb fearing cities

bomb-preacautions.png

Posted: 03/09/2013 11:02 AM IST
Precautions to be taken in bomb fearing cities

బాంబు పేలుళ్ళ నేపథ్యంలో బయటకు కనపడే నష్టాలే కాక మరెన్నో సమాజంలో జన జీవనానికి అడ్డంకులు కలిగించి చీకాకు పరచేవి మరెన్నో సంఘటనలు తలెత్తుతుంటాయి.  అందు వలన కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.  ఈ విషయంలో పోలీసులు నగరవాసులకు హెచ్చరికలు చేస్తూనేవున్నారు.  అవి కాక మిగిలినవి ఇవి-

మీ సూట్ కేస్ ని మర్చిపోయినా ఎక్కడికీ పోదు, ఎవరూ ముట్టుకోరు ఎక్కువ ఆలస్యం చెయ్యకుండా వెళ్ళి చూసుకుంటే అక్కడే భద్రంగా ఉంటుంది.   కానీ మరీ ఆలస్యం చేస్తే పలు అనుమానాలకు తావివ్వవచ్చు.  చాలా సేపటి నుంచి ఉంది కదా అని ఎవరో ఒకరు పోలీసులకు సమాచారాన్ని అందించవచ్చు.  అసలే పని ఒత్తిడిలో ఉన్న పోలీసులకు, మీరు సూట్ కేస్ వదిలేసిన ప్రదేశంలో ఉన్న మనుషులకూ అందరికీ అనవసరమైన టెన్షన్ లు కలిగే అవకాశం ఉంది కాబట్టి మీ వస్తువులను ఎక్కడా వదిలిపెట్టకండి.  

వాహనాలను నిలబెట్టిన చోట ఎక్కువ సేపు ఉంచి నట్లయితే వాటిని మళ్ళీ తీసేముందు జాగ్రత్తగా పరిశీలించి చూసుకోండి.  అందులో వేరెవరైనా ఏమైనా పేలుడు పదార్థాన్ని అమర్చే అవకాశం కూడా ఉంది.  అలా జరిగితే వాహన నష్టమే కాకుండా, ఆ వాహనం యజమానులైన మీమీద కూడా అనుమానాలు రావొచ్చు.  దర్యప్తులు జరగవచ్చు, దానితో మీ దైనందిన జీవితంలో అంతరాయం కలగవచ్చు.  అలాగే, ఎప్పుడూ మీ గుర్తింపు కాగితాలను దగ్గర పెట్టుకోండి.  ఏ ఆధారమూ లేకపోతే వేధింపులకు గురవటమే కాకుండా అనవసరంగా దర్యాప్త సంస్థలకు పని పెంచినవారవుతారు.  దర్యాప్తులో ఎక్కువ విషయాలున్నా అసలు విషయం మరుగున పడే అవకాశం ఉంది.  

పాత వాహనాలను కొనే ముందు పాత వాహన యజమానుల విషయంలో పూర్తిగా ఆరాతీసి కొనాలన్న విషయం చెప్పక్కరలేదనుకుంటా. 

అన్నిటికన్నా ముఖ్యం సమాజం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించండి.  రంగారెడ్డి జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్టుగా ఫోన్ సమాచారం అందటంతో బాంబు స్క్వాడ్ వెళ్ళి అంతా క్షుణ్ణంగా పరిశీలించి ఏమీ లేదని, ఎవరో ఆకతాయి చేసిన పనని, తేల్చింది.  ఏమీ జరగక పోవటం మంచిదే.  జరగలేదని నిరుత్సాహపడేవారెవరూ ఉండరు.  కానీ ఎంత పని సమయం దండగవుతోంది.  అటు దర్యాప్తు బృందాలకు, ఇటు కోర్టులో ఆ సమయంలో పని చేసే వారికి ఎంత సమయ నష్టం కలిగిందో ఆలోచించండి.

 అలాగే పోలీసులు ఇతర నిఘా దర్యాప్తు సంస్థలలోని సిబ్బంది కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సివుంటుంది.  అనుమానం కలగిందని చెప్పటానికి ఆధారాలుండవు కాబట్టి చూపించమనీ చెప్పరు.  పాత కక్షలను తీర్చుకోవటానికి అనుమానస్పదంగా ప్రవర్తించారు అని అనే అవకాశం ఉంది.  ఇందిరా గాంధీ దేశంలో ఇది అత్యవసర పరిస్థితి అంటూ ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో అటువంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి.  పోలీసులు ఆ విధంగా ప్రవర్తించకపోయినా, అలా చేస్తారేమోననే భయంతో ఉండటం కూడా జరగవచ్చు.  

ముఖ్యంగా వర్గ పోరాటానికి దారి తీయకుండా చూసుకోవాలి.  అసలే అక్బరుద్దీన్ వ్యాఖ్యల వలన ఎంత వద్దనుకున్నా ఏదో మూల బాధ, అసహనం వేధిస్తుండవచ్చు.  అలాగే తగోడియా వ్యాఖ్యల వలన కూడా గుండెలో చిచ్చు రగులుతూ ఉండవచ్చు.  అటువంటి ఙాపకాలు ఇంకా తాజాగా ఉన్న సమయంలో, రాజకీయ లబ్ధికోసం వాటిని వాడుకోవటానికి చూస్తే ఇరు వర్గాల మధ్య భగ్గుమనటానికి కూడా ఎంతో అవకాశం ఉంది.  అందువలన సంయమనం పాటించమని అందరూ కోరుకుంటున్నారు.  

హైద్రాబాద్ వాసులు ఎంతో సంయమనాన్ని పాటిస్తున్నారని అందరూ కొనియాడుతున్నారు.  నగరంలో జీవన వేగం అలాంటిది.  ఎవరికీ సమయం లేదు.  సాధ్యమైనంత వరకూ దులిపేసుకుని వెళ్ళిపోతేనే పనులు అవుతాయి.  ఇది కూడా సమాజానికి లాభమే చేకూర్చింది.  వ్యస్తులై వుండటం కూడా మంచిదే.  ఒకప్పుడు విద్యార్థులలో అశాంతి బాగా ఉండేది.  సిలబస్ పెరిగిపోయి, పోటీ పరీక్షలు కఠినమైపోయి, ఉద్యోగావకాశాలు చిక్కిపోయి పోటీతత్వానికి ఉసిగొలుపుతుంటే అశాంతి భావన ఎక్కుడుంటుంది.  జీవితం ఒక పరుగు పందెమే అయిపోతుంది.  అదే జరిగింది, అదీ ఒకరకంగా సామాజిక శ్రేయస్సుకే దారితీసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bitti mohanti fugitive from law arrested in kerala
Un constitutional appointment of venezulea president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles