Un constitutional appointment of venezulea president

venezulea, hugo chavez, nicolas maduro, united states of america

un-constitutional appointment of venezulea president

nicolas-maduro.png

Posted: 03/09/2013 09:00 AM IST
Un constitutional appointment of venezulea president

nicolas-swearing-in

వెనుజులా దేశాధ్యక్షుడు హ్యూగో ఛావేజ్ స్థానంలో ఇంతవరకూ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నికొలస్ మాడురో అధ్యక్షుడిగా నియామకమయ్యారు.  నిన్న ఘనంగా శపథ స్వీకార వేడుక జరిగింది.  

కానీ 1999 లో రాసుకున్న దేశ రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రపతి చనిపోయిన సందర్భంలో జాతీయ శాసనసభ సభాపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించవలసి వుంటుంది.  ఆ తర్వాత 30 రోజుల లోగా రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించవలసివుంటుంది.  

ఈ శపథగ్రహణ సమారోహాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష నాయకుడు హెన్రిక్ కాప్రైల్స్, ఛావేజ్ కర్మకాండ జరుగుతుండగానే నికొలస్ అధ్యక్షపదవి కోసం ప్రచారం మొదలుపెట్టారంటూ విమర్శించారు.  హెన్రికం కాప్రైల్ రానున్న ఎన్నికల్లో నికొలస్ కి గట్టి పోటీ ఇవ్వబోతున్నారని తెలిసింది.  

శపథ స్వీకారం అవగానే నికొలస్ మాడురో ప్రతిపక్షాల మీదా అమెరికా ప్రభుత్వం మీదా విరుచుకపడ్డారు.  అమెరికా దేశానికి మిగతా దేశాలను గౌరవించటం నేర్చుకోవటం మంచిదని హెచ్చరించారు.  నికొలస్ నియామకం రాజ్యాంగ విరుద్ధమని అమెరికా ప్రభుత్వం వ్యాఖ్యానించటం నికొలస్ కి రుచించలేదు.

 బస్ డ్రైవర్ గా పనిచేస్తూ యూనియన్ కార్యకలాపాలలో చురుగ్గా పనిచేసిన నికొలస్ అధ్యక్షుడ ఛావేజ్ పక్కన చాలాసార్లు కనిపించారు.  ఆ తర్వాత ఛావేజ్ కూడా తన తర్వాత రాజకీయ వారసుడతడే అని ప్రకటించటం జరిగింది.  ఛావేజ్ మరణం తర్వాత రక్షణ శాఖ అధికార పార్టీకీ మద్దతుగా నిలవటం రాజకీయ విమర్శకులకు చర్చలకు ప్రధానాంశమైంది.  శపథ స్పీకారం తరువాత నికొలస్ విజయ సూచకంగా పిడికిళ్ళను పైకి ఎత్తుతూ, సైన్యాలను ఛావేజ్ సైన్యంగా ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Precautions to be taken in bomb fearing cities
Development in dilsukhnagar bomb blast case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles