Bitti mohanti fugitive from law arrested in kerala

bitti mohanti, bb mohanti, rapist of german national, rajasthan court

bitti mohanti fugitive from law arrested in kerala

bitti-mohanti.png

Posted: 03/09/2013 11:10 AM IST
Bitti mohanti fugitive from law arrested in kerala

చనిపోయిన మనిషి బతికి అరెస్టయ్యాడా.  ఇది టివి సీరియల్ కాదు.

మార్చి 2006 లో బిట్టి మొహంతి అనే యువకుడు రాజస్తాన్ లో ఒక జర్మనీ యువతి మీద అత్యాచారం చేసిన నేరం మీద రాజస్తాన్ కోర్టు విధించిన 7 సంవత్సరాల కారాగార శిక్షలో ఉన్న సమయంలో పేరోల్ లో పారిపోయాడు.  ఏడు నెలల శిక్షానంతరం తల్లికి ఆరోగ్యం బాగోలేదన్న మిషతో పేరోల్ మీద వెళ్ళి బిట్టీ తిరిగి రాలేదు.  బిట్టీకి హామీగా నిలిచిన అతని తండ్రి బిబి మొహంతి ఒడిశా హోంగార్డ్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసేవారు.  ఆయనే తన కొడుకు పరారీకి బాధ్యడనే నేరం మీద ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ ను జారీ చెయ్యగా ఆయన కూడా పరారీ అయ్యారు కానీ 2008 లో తిరిగి పోలీసులకు లొంగిపోయారు.  

బహుశా బిట్టి మొహంతి విదేశాలకు పారిపోయి వుంటాడని పోలీసులు అనుమానించారు.  కొడుకు గురించి అడగ్గా,  నాకు తెలియదు ఎక్కడున్నాడో, బహుశా చనిపోయుంటాడు, ఏ కొడుకూ బ్రతికున్నట్లయితే, మేమెంత బాధపడుతున్నాం, ఇంతకాలం తన కుటుంబం దగ్గరకు రాకుండా ఉంటాడా అన్నారాయన.  

అయితే కేరళ పోలీసులు కేరళలోని కన్నూర్ లో బిట్టి ని అరెస్ట్ చేసారు.  కేరళకు పోకముందు బిట్టి ఆంధ్రప్రదేశ్ లో కొన్నాళ్ళు ఉన్నాడట.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్ కోర్ లో పనిచేస్తున్న బిట్టి, రాఘవ రాజన్ గా తన పేరు మార్చుకుని కేరళలో ఉంటున్నాడు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pak pm received by khurshid at jaypur
Precautions to be taken in bomb fearing cities  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles