Home minister sk shinde inadvertently reads his speech in rajya sabha

home minister shinde, rajya sabha, susheel kumar shinde

home minister sk shinde inadvertently reads his speech in rajya sabha

sk-shinde.png

Posted: 03/02/2013 02:11 PM IST
Home minister sk shinde inadvertently reads his speech in rajya sabha

susheel-k-shinde

3 ఇడియట్స్ అనే సినిమాలో, మరొకరు రాసిచ్చిన ప్రసంగాన్ని అనాలోచితంగా చదివి కడుపుబ్బ నవ్వించిన సన్నివేశం నిన్న రాజ్య సభలో జరిగిన సంఘటనతో గుర్తుకొస్తుంది.

నిన్న రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రసంగంలో ఆయన అత్యాచార కేసుల గురించి చెప్తూ, అనాలోచితంగా అక్కడ రాసున్నది రాసున్నట్టుగా చదవటం లో నిమగ్నమై, అత్యాచారానికి గురైన బాలికలు, మహిళల పేర్లు కూడా చదివేసారు. ఒక కేసులో పేర్లు బయట పెడుతుంటే వారించబోయిన అరుణ్ జైట్లీ మాటలను అర్థం చేసుకోక మిగిలిన కేసుల్లో బాధితుల పేర్లు కూడా బయటపెట్టేసారు. తనకు రాసిచ్చిన దానిలోని అక్షరాలను కూడబలుక్కుని ఉన్నదున్నట్టుగా చదవటంలో పూర్తిగా మునిగిపోయిన హోం మంత్రికి, అందులో చదవగూడనివి, ప్రకటించగూడనివి ఆయన దృష్టి నుంచి తప్పించుకున్నాయి. అత్యాచారాల సంఘటనలలో బాధితుల పేర్లను పైకి చెప్పగూడదన్న సంగతి సర్వ సామాన్యంగా అందరికీ తెలిసిందే కానీ హోం మంత్రి ఈ నియమాన్ని ఉల్లంఘించారు.

రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజి కురియన్ విడమరచి చెప్పేంత వరకూ తన తప్పుని తాను తెలుసుకోలేకపోయిన షిండే, అర్థమైన తర్వాత ముందుగా అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ, తను చదువుతున్న ఆ ప్రకటనలో ఆ పేర్లను, చేర్చిందెవరో నాకు తెలియాలి అంటూ హోంశాఖను విచారణ చెయ్యమని ఆదేశించారు.

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా అనాలోచితంగా ఏదో మాట్లాడెయ్యటం, తిరిగి దాన్ని సవరించుకునే ప్రయత్నంలో నాలిక కొరుక్కోవటం అలవాటు చేసుకున్నట్టున్నారు. లోగడ కూడా ఎన్నో సందర్భాల్లో అనాలోచితంగా మాట్లాడి, ఆ తర్వాత ఆ తప్పు దిద్దుకునే దిశగా ఆయన క్షమాపణలు చెప్పుకోవటమో మరేదో చేసారు.

రాజకీయాల్లో ఉన్న వాడి, వేడి, ఎత్తుకు పై ఎత్తులతో ఒత్తిడికి లోనైన మస్తిష్కాలకు ఇలాంటి సంఘటనలు వినోదాన్ని కలిగించి వారికి కొంత సేద తీరుస్తాయేమో.

-శ్రీజ


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man missing after sinkhole grows under his bedroom
Violence errupted in north delhi over girl rape  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles