Violence errupted in north delhi over girl rape

dehli rape, minor raped in delhi, protests over rape

violence errupted in north delhi over girl rape

rampage-over-girl-rape.png

Posted: 03/02/2013 12:50 PM IST
Violence errupted in north delhi over girl rape

protestors-on-girl-rape

ఢిల్లీలో మున్సిపల్ స్కూల్ లో బాలిక మీద జరిగిన అత్యాచారం వార్త విని మంగోల్ పురి వాసులు నిన్న ఆందోళనకు దిగారు.  బస్సులను, హాస్పిటల్ లో వస్తువులను ధ్వంసం చేసారు.  పోలీసులు పరిస్థితిని అదుపు చేసే క్రమంలో 12 మందిని అరెస్ట్ చేసారు. గురువారం నాడు స్కూల్ కి వెళ్ళిన రెండవ తరగతి చదువుకుంటున్న బాలిక మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి కలిగిన గాయాలను చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.  అత్యాచారం జరిగినట్టుగా హాస్పిటల్ పరీక్షణలో తేలిన తర్వాత పోలీసులు శుక్రవారం కేసుని నమోదు చేసారు.  స్కూల్ లోని టీచర్లు, ఇతర సిబ్బందిని విచారిద్దామని పోలీసులు ఉపక్రమిస్తుండగానే కొందరు ఆందోళనకారులు హాస్పిటల్ ఎదురుగా రోడ్డు మీద ట్రాఫిక్ ని నిలిపివేస్తూ హాస్పిటల్ లోకి ప్రవేశించి అక్కడి వస్తువులను ధ్వంసం చెయ్యటం మొదలుపెట్టారు. 

delhi-bus-damaged-by-protestors

అత్యాచారానికి గురైన బాలిక హాస్పిటల్ లో చనిపోయిందన్న వార్త బయట వ్యాపించటంతో స్థానికుల ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తోంది.  బస్సుని ధ్వంసం చేసిన మూకలు పోలీసు వాహనాలను, పోలీస్ చౌకీని కూడా లక్ష్యంగా చేసుకుని విధ్వంసాన్ని సృష్టించగా పోలీసు సిబ్బందిలో ముగ్గురు గాయపడ్డారు. 

ఉత్తర ఢిల్లీ మున్సిపల్ అదనపు కమిషనర్ దీపక్ హస్తిర్ మాట్లాడుతూ, ఈ విషయంలో దర్యప్తు చేస్తున్న పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని, అపరాధం చేసినవారెవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని అన్నారు. 

మధ్యాహ్న భోజనానికి వెళ్ళిన బాలికను చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలను దూర్చి అత్యాచారానికి ఒడిగట్టారంటూ ఆ పాప తండ్రి ఆవేదనతో చెప్పారు. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Home minister sk shinde inadvertently reads his speech in rajya sabha
Supreme court decision on babli in favor of ap says cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles