Supreme court decision on babli in favor of ap says cm

babli project, maharashtra, andhra pradesh, supreme court

supreme court decision on babli in favor of ap says cm

all-is-well.png

Posted: 03/02/2013 11:49 AM IST
Supreme court decision on babli in favor of ap says cm

babli-project

నిన్న సాయంత్రం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం మీద సుప్రీం కోర్టు తీర్పు గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అంతా మన మంచికే అన్న ధోరణిలో మాట్లాడారు.  సుప్రీం కోర్టు తీర్పు వలన రాష్ట్రానికి మేలే జరుగుతుందని ఆయన అన్నారు.  60 టిఎమ్ సిలకు మించి గోదావరి జలాలను మహారాష్ట్ర వాడుకోరాదని, వర్షాకాలమంతా గేట్లను బార్లా తెరచే వుంచాలని ఇచ్చిన తీర్పు వలన మనకు నష్టం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తూ, అఖిల పక్షం ఒకవేళ నష్టం జరుగుతుందని భావించనట్లయితే దాన్నిబట్టి సుప్రీం కోర్టుకి మరో సారి పోతాం అన్నారు  కిరణ్ కుమార్ రెడ్డి.  ఒప్పందంలో ఉన్నదాన్ని బట్టే సుప్రీం కోర్టు తీర్పు లభించింది, అది అంతకుముందున్న స్థితే కూడా.  అలాంటప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు వెయ్యవలసి వచ్చిందో ఆయన తెలియజేయలేదు. 

ప్రతి పక్షాలు ప్రతిదానికీ విమర్శిస్తారని, ఇంధనం విద్యుత్ ఛార్జీలతో రాష్ట్ర ప్రభుత్వానికేమీ సంబంధం లేదని, అయినా, ఛార్జీలు పెంచకుండా ఉండటానికి ఏ ఖర్చులను తగ్గించుకోవాలో ప్రతిపక్షాలే చెప్పాలన్నారు ముఖ్యమంత్రి.  వచ్చే ఏడాది వరకు వ్యవసాయ ఋణాలు 70 వేల కోట్లకు, మహిళా ఋణాలు 36 వేల కోట్లకు చేరుకుంటాయి.  రైతుల ఋణాలను రద్దు చెయ్యాలంటే 2 లక్షల కోట్లు కావాలి.  అంత సొమ్మును చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారు, ఈ విషయాన్ని ప్రజలు ఎలా నమ్ముతారు అని ప్రశ్నించారాయన. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Violence errupted in north delhi over girl rape
Sudan national arrested for marrying a minor at hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles