Sudan national arrested for marrying a minor at hyderabad

child marriage act, sudan, marriage with a minor girl

sudan national arrested for marrying a minor at hyderabad

sudan-national-marries-indi.png

Posted: 03/02/2013 11:28 AM IST
Sudan national arrested for marrying a minor at hyderabad

హైద్రాబాద్ లో మైనర్ బాలికను పెళ్ళి చేసుకున్న సూడన్ కి చెందిన ఒసామా ఇబ్రహీమ్ ని, అందుకు సహకరించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అరెస్టైన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. 

సూడన్ లో ఒక పెట్రోలియమ్ సంస్థలో పనిచేస్తున్న ఒసామా ఇబ్రహీమ్ అసలు భారత్ కి వచ్చిందే పెళ్ళి చేసుకోవటానికట.  దీని వెనక ఎటువంటి ప్రేమ కథా లేదు.  అసలతను అంతకు ముందు ఆ బాలికను చూడలేదు కూడా.  హైద్రాబాద్ లో అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం సులభమని అతని స్నేహితుడు చెప్పటంతో ఫిబ్రవరి 19 న ఇక్కడకు వచ్చి, అందుకోసం రెండు లక్షల రూపాయలను కూడా వెచ్చించాడు.  ముంతాజ్ బేగం అనే మహిళ అతనికి ఒక నలుగురు అమ్మాయిలను చూపించగా, ఒసామా ఒక 17 సంవత్సరాల బాలికను ఎంపిక చేసుకున్నాడు. 

ఆ అమ్మాయి ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు.  తండ్రి వయసున్నవాడితో పెళ్ళేమిటని తిరస్కరిస్తే, ముంతాజ్ ఆమె తల్లిదండ్రులను ఎలాగో ఒప్పించింది.  దానితో ఆ అమ్మాయికి ఫిబ్రవరి 21 న బలవంతపు పెళ్ళి జరిగింది.  అక్కడ నుంచి తప్పించుకుని ఆ బాలిక మొఘల్ పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యగా, పోలీసులు ఆ ఘటనకు సంబంధించిన వారినందరినీ అదుపులోకి తీసుకున్నారు.  ఈ లోపులో ఆ అమ్మాయి నకిలీ బర్త సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేస్తూ దొరికిపోయారు.  లక్షరూపాయలు తీసుకుని పెళ్ళికి ఏర్పాట్లు చేసిన మహమ్మద్ హసన్, ముంతాజ్ బేగం, మరో క్వాజీ మొహమ్మద్  నజీరుద్దీన్ అనే వాళ్ళు ప్రస్తుతం మొఘల్ పురా పోలీసు అదుపులో ఉన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme court decision on babli in favor of ap says cm
Raja paksa denies killingr of son of ltte leader prabhakaran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles