Akbaruddin owaisi could be arrested in hate speech case

andhra pradesh, mim, hate speech, akbaruddin owaisi, hyderabad, asauddin owaisi

Andhra Pradesh Director General of Police Dinesh Reddy on Thursday denied any political interference in the alleged hate speech case against MIM MLA Akbaruddin Owaisi

Akbaruddin Owaisi could be arrested in hate speech case.png

Posted: 01/04/2013 09:13 AM IST
Akbaruddin owaisi could be arrested in hate speech case

Owisiఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో మజ్లిస్‌ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడిన ప్రసంగం పెద్ద దుమారాన్నే రేపుతుంది. ఈ వ్యవహారాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. హిందూ మతాచారాలు, సంప్రదాయాలు, వ్యవహారా లపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన ఆయనతో అమీ తుమీ తేల్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఆయన మాట్లాడిన టేపులను సేకరించి,  వాటిని ప్రజల్లోకి సైతం తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. హిందూ మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన అక్బర్‌ అరెస్టు అయ్యేదాకా పోరాటం సాగించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. అక్బర్‌పై ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌ పీఎస్‌తో పాటు నాంపల్లి కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయిన విషయం తెలిసిందే. ఒకవైపు అక్బర్‌ శాసనసభ్యత్వం రద్దు చేయించటం, మరోవైపు మజ్లిస్‌ పార్టీ గుర్తింపును రద్దు చేయించే విధంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలిసింది. అక్బర్‌ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో చర్చకు పెడతామని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం అక్బరుద్దీన్ ఓవైసీ లండన్ లో ఉన్నారు. ఆయన లండన్ నుండి రాగానే అరెస్టు చేస్తారా ? లేదా అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp suspends ex mla ramachandra reddy
Cpibjp friend ship  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles