Cpibjp friend ship

cpi_bjp.png

Posted: 01/04/2013 09:03 AM IST
Cpibjp friend ship

bjp_cpiసీపీఐ పార్టీ - బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా విరుద్ధం. కమ్యూనిస్టు పార్టీగా సీపీఐకి ముద్ర ఉంటే, మతతత్వ పార్టీగా బీజేపీకి మద్ర ఉంది. అటువంటి పార్టీలు త్వరలో ఏకతాటి పైకి వచ్చి కలిసి పనిచేయబోతున్నాయా ? అంటే...సీపీఐ రాష్ట్రకమిటీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. రాష్ట్ర కార్యలయం మగ్ధుంభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ... తెలంగాణపై ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్షంలో నెల లోపున కేంద్రం నిర్ణయం ప్రకటిస్తుందని వెలువడిన ప్రకటన దరిమిలా.. ఆ ప్రకటన నుండి కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు కేంద్రంపై ఒత్తిడే లక్ష్యంగా... జనవరి 19న ఇందిరాపార్కులో సీపీఐ ఆధ్వర్యంలో మహా ధర్నాను నిర్వహించాలని నిర్ణయించారు. అంతే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సానుకూల వైఖరి కలిగిన పార్టీలను, ప్రజా సంఘాలను, వ్యక్తులను ఆహ్వానించాలని ఈ సమావేశం తీర్మానించింది. అంటే బిజేపీని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించే విషయాన్ని సీపీఐ పరోక్షంగా ధృవపరుస్తోంది. మొదటి సారిగా బిజెపితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేయడానికి సిపిఐ ముందుకు రావడం విశేషం.అలాగే టిడిపి,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లను కూడా కలుపుకుని ఒక రౌండ్ టేబుల్ నిర్వహించాలని కూడా సిపిఐ భావిస్తోంది. ఏదైతేనేం ఉద్యమం కోసం పార్టీ సిద్ధాంతాలను పక్కకు పెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్న సీపీఐని అభినందించాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akbaruddin owaisi could be arrested in hate speech case
Karunanidhi hints stalin will be his successor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles