Ap congress seeks postponement of telangana all party meet

botsa want all-party meet postponed, andhra pradesh, telangana issue, congress, all-party meeting, world telugu conference, botsa meets cm to discuss party kiran, chief minister n kiran kumar reddy,pcc president botsa satyanarayana, central minister gulam nabhi azad, december 28th

ap congress seeks postponement of telangana all-party meet

postponement.gif

Posted: 12/07/2012 06:44 PM IST
Ap congress seeks postponement of telangana all party meet

ap congress seeks postponement of telangana all-party meet

తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు, జేఏసీ నేతలు, అందరు  డిసెంబర్ 28వ తేది కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు తెలంగాణ పై  అఖిలపక్ష సమావేశం ఏర్పాటు కానుంది. అన్నీ రాజకీయ పార్టీలు కూడా అఖిల పక్ష సమావేశానికి  సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇలాంటి  సమయంలో  బొత్స సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. తెలంగాణ అంశంపై ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష సమావేశంలో ఇతర పార్టీల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు మాత్నమే సేకరిస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అన్ని పార్టీల ఆలోచనలు, విధానాలు తెలుసుకున్న తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సదస్సులో సహకార ఎన్నికల కార్యాచరణ రూపకల్పనపై చర్చ ఉంటుందని, అఖిలపక్షంపై చర్చ ఉండదని తెలిపారు. 2009 డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే ఈసారి కూడా చెప్పక పోవచ్చునన్నారు. షిండే అడిగితే చూస్తుందన్నారు. సున్నితమైన ఈ అంశంపై అధిష్టానం సమీక్షిస్తోందని తెలిపారు. తెలుగు మహాసభల దృష్ట్యా అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని గులాంనబీ అజాద్‌ను కోరినట్లు బొత్స వెల్లడించారు. కంగ్రెస్ సదస్సులో కొన్ని ప్రాంతాల సమస్యలపై చర్చ జరుగుతుందని అన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో, బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ విస్తృతస్తాయి సమావేశంపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  11 convicted four acquitted in guwahati molestation case
Upa govt wins rajya sabha vote on fdi in retail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles