Cm kiran land distribution

cm kiran land distribution programme, cm kiran in public meeting, cm kiran kumar reddy speech, cm kiran in anantapur public meeting,

cm kiran land distribution

9.gif

Posted: 11/04/2012 12:23 PM IST
Cm kiran land distribution

kirankumar-red

ఆరు నెలల్లోపు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా భూమి అందిస్తామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. భూమి వల్లే సమాజంలో గౌరవం, మర్యాద, హోదా లభిస్తాయని.. అర్హులందరికీ భూమి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆశయమని చెప్పారు. "రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాగుకు అవసరమైన భూమిని గుర్తించాలని ఆదేశించాను. పట్టణ, నగర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ అవసరాలకు పోను మిగిలిన సాగుయోగ్యమైన భూమిని పేదలందరికీ పంచిపెడతాం'' అని సీఎం ప్రకటించారు. ఆరో విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి ప్రారంభించారు.
  ఆరో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 85 వేల ఎకరాల భూమిని అర్హులైన పేదలకు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు అన్నం పెట్టేది, పని కల్పించేది భూమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2004 తర్వాత ఇప్పటి వరకూ 6.80 లక్షలు ఎకరాలు పంపిణీ చేశామని సీఎం వివరించారు. భూమికి సంబంధించిన పట్టాతోపాటు, పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్ కలిపి ఒకేసారి ఇవ్వటం వల్ల వారికి ఆ పొలంపై పూర్తి హక్కు కల్పించినట్లవుతుందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న ప్రతి రైతుకు వడ్డీ మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramappa temple in waragangal
Ap governor esl narsimhan birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles