Ramappa temple in waragangal

ramappa temple in waragangal, ramalingeswara swami temple warangal, ramappa temple entrance arch collapse, ramappa temple pics, ramappa temple history

ramappa temple in waragangal

13.gif

Posted: 11/04/2012 12:29 PM IST
Ramappa temple in waragangal

ramappa1e

వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం రామప్ప దేవాలయంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కూలిన తూర్పు ముఖద్వారాన్ని నిన్న పలుశాఖల అధికారులు పరిశీలించారు. కాకతీయ ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో కూలిన రామప్ప తూర్పు ముఖద్వార ప్రాకారం వద్దకు వారంతా హుటాహుటిన చేరుకొన్నారు. జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ డి.రాజేశ్వర్ ప్రాకారం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాకారాన్ని ఎవరైనా బయట వ్యక్తులు కూల్చేశారా లేక 'నీలం' తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు పడిపోయిందా అనే కోణంలో పరిశీలించారు.  రామప్ప ఆలయ తూర్పు ముఖద్వారానికి సత్వరమే మరమ్మతులు జరిగేలా కేంద్ర పురావస్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కాగా, రామప్ప దేవాలయం, తూర్పుముఖద్వారం పరిస్థితులపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతానని రెవెన్యూ డివిజనల్ అధికారి మోతీలాల్ అన్నారు. శనివారం కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఆదేశాలతో ఆయన ముఖద్వారం కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే.. కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులు, ఉత్సవాల ఏర్పాట్లను ఆరా తీశారు. ఇదిలా ఉండగా, రామప్ప దేవాలయాన్ని శనివారం సాయంత్రం టూరిజంశాఖ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ సంధ్యాసింగ్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఆలయ ప్రధాన అర్చకుడు హరీష్‌శర్మ, అర్చకుడు ఉమాశంకర్ వారిని సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు. అనంతరం సంధ్యాసింగ్ తదితరులు రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Union minister chiranjeevi press meet hyd
Cm kiran land distribution  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles