Mamata banerjee blasts media channels for news pollution

Mamata Banerjee, blasts, media, channels,

Mamata Banerjee blasts media, channels for 'news pollution'

Mamata.gif

Posted: 10/17/2012 12:59 PM IST
Mamata banerjee blasts media channels for news pollution

Mamata Banerjee blasts media, channels for 'news pollution'

బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ టీచర్ అవతారమెత్తారు. జర్నలిజం మూలాలు, నైతిక విలువల గురించి క్లాస్ తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా తన బాధ్యత మరచి ప్రవర్తిస్తోందని ఆరోపించారు. వార్తలు అందించే క్రమంలో విలేకరులు దాదాగిరీ చేస్తున్నారని విమర్శించారు. కొంతమంది రాష్ట్ర రాజకీయాలను శాసించాలని ప్రయత్నిస్తున్నారని దీదీ దుయ్యబట్టారు. ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. టీవీ స్టూడియోల్లో కూర్చుని దాదాగిరీ చేస్తూ డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని విలేకరులను విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక 'జాగో బంగ్లా' ప్రత్యేక సంచిక విడుదల సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు. పత్రికలు ప్రచురించే వ్యతిరేక కథనాలతో తాను విసిగిపోయాననని చెప్పారు. ఒకనాడు పత్రికలు విలువలకు కట్టుబడి ఉండేవని, సంఘంపై దుష్ప్రభావం చూపే ఫొటోలను ప్రచురించేవి కావని చెప్పారు. కానీ, ప్రస్తుతం మొదటి పేజీల్లోనే ప్రచురిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పత్రికలకు, టీవీ చానళ్లకు ఆమె కొన్ని సూచనలు చేశారు.

* అత్యాచారాలు, ఆత్మహత్యలను ప్రముఖంగా ప్రచురించొద్దు.

* టీవీ స్టూడియోల్లో కూర్చుని దాదాగిరీ చేయొద్దు.

* డబ్బు సంపాదించాలన్న కాంక్షను విలేకరులు తగ్గించుకోవాలి.

* ఏదైనా కథనం ప్రచురించేటప్పుడు/ప్రసారం చేసేటప్పుడు దానికి సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోవాలి.

* ఫోన్ ద్వారా సమాచారం సేకరించి వార్తలు ప్రసారం చేయొద్దు.

*భయానక ఫొటోలను టీవీల్లోగానీ, పత్రికల్లో గానీ ప్రచురించొద్దు.

* ప్రభుత్వం పేరు చెడగొట్టేలా కథనాలు ప్రసారం చేయొద్దు.

* డబ్బు సంపాదన కోసం ప్రజలకు హాని కలిగించొద్దు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Attacks for women in ap
Rapes happen because men and women interact freely mamata  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles