Attacks for women in ap

attacks, women,AP,brahmanism telugu movie

attacks for women in AP

brahmanism.gif

Posted: 10/17/2012 01:06 PM IST
Attacks for women in ap

attacks for women in AP

బ్రాహ్మణ మహిళలను కించపరిచేలా.. యావత్ మహిళాజాతిని అవమానించేలా ఉన్న 'ఎ వుమన్ ఇన్ బ్రాహ్మణిజం' సినిమాను నిషేధించాలని ఏపీ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య డిమాండ్ చేసింది. కులాలు, మతాలను కించపరిచేలా సినిమాలు ఉండటం శోచనీయమని సంఘం ఉపాధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, చీఫ్ కో ఆర్డినేటర్ అన్నదానం సత్యనారాయణ అన్నారు.చలం నవల పేరు చెప్పి బూతు చిత్రంగా తీయడంలో అర్థం లేదన్నారు. చలం పేరుతో అనవసరంగా తప్పు చేస్తున్నారని, అసలు ఆయన రాసిన 'బ్రాహ్మణీకం నవలలో స్త్రీని కించపరిచేలా ఎక్కడా లేదని వేదవిజ్ఞాన పరిషత్తుకు చెందిన పద్మనాభశర్మ అన్నారు. ఇదే చలం 'అమీనా' నవల కూడా రాశారని, దాన్ని సినిమాలా తీసే దమ్ముందా అని నిలదీశారు.ఇక చలం అంటేనే స్త్రీ పక్షపాతి అని.. అలాంటి వ్యక్తి రాసిన పుస్తకం పేరు అడ్డం పెట్టుకుని బ్రాహ్మణులను, బ్రాహ్మణ మహిళలను కించపరిచేలా అసభ్యంగా సినిమాలు తీస్తున్నారంటూ ద్రోణంరాజు రవికుమార్ మండిపడ్డారు. ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి స్వాతి సోమనాథ్ కూడా సినిమా దర్శక నిర్మాతలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. "అసలు చలం మహిళలను ఎక్కడ కించపరిచాడో చూపించు. నీలాంటివాణ్ని ఉరితీయాలి. రాళ్లతో కొట్టాలి. ఇలాంటి సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చినందుకు సెన్సార్‌బోర్డు వాళ్లను ఉరితీయాలి'' అని ఆమె అన్నారు. అభ్యంతరకరంగా అనిపించిన సన్నివేశాలను, డైలాగులను ఉపసంహరించుకుంటానని చిత్ర నిర్మాత గంగాధర్ తెలిపారు.

attacks for women in AP

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Oldest dad is father again at 96
Mamata banerjee blasts media channels for news pollution  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles