Telangana protesters attacked on mp renuka chowdary

Telangana Protesters Attacked on MP Renuka Chowdary

Telangana Protesters Attacked on MP Renuka Chowdary

Telangana.gif

Posted: 10/04/2012 08:10 PM IST
Telangana protesters attacked on mp renuka chowdary

Telangana Protesters Attacked on MP Renuka Chowdary

రాజ్యసభ సభ్యురాలు, ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరికి తెలంగాణ సెగ తగిలింది. ఆమె హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వచ్చిన తెలంగాణవాదులు అదే సమయంలో అక్కడికి వచ్చిన రేణుకా చౌదరిని అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం 6.15 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేణుకా చౌదరి దేశీయ టెర్మినల్ నుంచి బయుటకు వస్తుండగా తెలంగాణవాదులు, తెరాస నాయకులు ఒక్కసారిగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేయుడంతో పాటు రేణుకా చౌదరి డౌన్ డౌన్.. తెలంగాణ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రేణుకా చౌదరి కూడా ఒకింత ఆగ్రహంతో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నేనూ తెలంగాణ వాదినే.. ఎందుకరుస్తున్నారని కసురుకున్నారు. పరుషపదజాలం వారిపై ఉపయోగించి అక్కడ నుండి వెళ్లిపోయారు. సిఎంపై అభాండాలు వద్దు... రాయపాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు అభాండాలు వేయడం తగదని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు చిత్తూరు జిల్లాలో హితవు పలికారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన రాత్రి ఆలయం ముందు విలేకరులతో మాట్లాడారు. ఎంపీలను కించపరిచారంటూ సభాహక్కుల ఉల్లంఘన కింద పార్లమెంటులో సీఎంపై చర్యలు కోరతామనడం సరికాదన్నారు. తనపై తెలంగాణ ఎంపీలు అసభ్యంగా మాట్లాడుతున్నారని, అందుకని సమైక్యాంధ్ర గురించి తాను మాట్లాడదలుచుకోలేదని రాయపాటి పేర్కొన్నారు. ఏదైనా ఉంటే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాతే స్పందిస్తానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp blows war bugle
The gym teacher who says he was beaten up by a first grader  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles