Tdp blows war bugle

TDP blows war bugle, TDP padayatra N Chandrababu Naidu NTR Trust Bhavan Telugu Desam Party Congress

'Padayatra, vasthunna mee kosam': TDP blows war bugle

TDP.gif

Posted: 10/04/2012 08:20 PM IST
Tdp blows war bugle

'Padayatra, vasthunna mee kosam': TDP blows war bugle

టిడిపి అదినేత చంద్రబాబు పాదయాత్రతో మళ్లీ మీడియా వార్ కూడా మొదలైనట్లుగా ఉంది. చంద్రబాబుకు మద్దతుగా రెండు ప్రధాన పత్రికలు ప్రముఖంగా కధనాలు ఇస్తుంటే, మరో పత్రిక చంద్రబాబు పాదయాత్రను దుయ్యబడుతూ వ్యతిరేక కధనాలు ఇస్తోంది. ఈనాడు దినపత్రిక జనంతో మమేకం అంటూ చంద్రబాబు ఫోటో తో సహా పాజిటివ్ కధనాన్ని పెద్ద ఎత్తున ఇచ్చింది. అలాగే మరో పత్రిక సైతం అదే తరహా లో జన నీరాజనం అంటూ కధనాన్ని ఇచ్చింది. కాని సాక్షి పత్రిక మాత్రంవీధి నాటకానికే చంద్రబాబు యాత్రలు,అంటూ కిరణ్ సర్కార్ ను మోస్తూ యాత్రలా అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిది వాసిరెడ్డి చేసిన విమర్శలను బ్యానర్ గా చేశారు. సాధారణంగా మీడియా సమావేశ వార్తలను ప్రముఖంగా ఇవ్వరు. కాని చంద్రబాబు తన పాదయాత్రలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను, సాక్షిని ప్రధానంగా టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్న నేపధ్యంలో కూడా ఈ వార్తకు ప్రాముఖ్యం ఇచ్చినట్లు కనబడుతోంది. అదే సమయంలో చంద్రబాబు పాదయాత్రకు వస్తున్న పాజిటివ్ కవరేజీ, జనంలో ఏమైనా ఆదరణ పెరుగుతుందేమోనన్న అనుమానం కూడా వీరిని వెంటాడుతుండవచ్చు. అలాగే ఒవైసీ చంద్రబాబును విమర్శించిన వార్తకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు.పాదయాత్ర సాగినంతకాలం ఈ వార్ సాగుతూనే ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana movement
Telangana protesters attacked on mp renuka chowdary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles