The gym teacher who says he was beaten up by a first grader

The gym teacher who says he was beaten up by a first grader

The gym teacher who says he was beaten up by a first grader

teacher.gif

Posted: 10/04/2012 08:05 PM IST
The gym teacher who says he was beaten up by a first grader

The gym teacher who says he was beaten up by a first grader

ఇదో వింత కేసు. ఈ పిల్లాడంట.. ఈ బండోడిని కొట్టాడంట. పైగా.. ఆ వ్యక్తి మంచి బలశాలి. జిమ్ టీచర్ కూడాను.. ఈ బుడ్డొడు ఇతడిని చావబాదాడంటే ఎవరైనా నమ్ముతారా? ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లోనూ అందరూ ఇదే అనుకుంటున్నారు. ఇతడి పేరు జాన్ వెబ్‌స్టర్(27). న్యూయార్క్‌లోని క్వీన్స్ పబ్లిక్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ఈ పిల్లాడి పేరు రాడ్రియో కార్పియో(6). రాడ్రియో ఇతడి స్టూడెంటే. ఇంతకీ ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏం జరిగిందంటే.. ఆరోజున స్కూల్ కాఫీ షాపులో పిల్లలు గొడవపడుతున్నారు. వారిని అడ్డుకోవడానికి జాన్ ప్రయత్నించడంతో.. కార్పియో అతడితోపాటు మరో ఇద్దరినీ చితకబాదేశాడట.ఈ పిల్లాడి దెబ్బలకు జాన్‌కు కాళ్లు విరిగిపోయినంత పనైందట. అప్పట్నుంచి మెడికల్ లీవ్ మీద ఇంటి పట్టునే ఉంటున్న జాన్.. ఇప్పుడు తనకు జరిగిన నష్టానికి పరిహారమిప్పించాలంటూ న్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌పైనే దావా వేయడానికి సిద్ధమవుతున్నాడు. వైద్య చికిత్సలకు అయిన ఖర్చులతోపాటు మరికొన్ని ‘నష్టాలకు’ తనకు పరిహారమిప్పించాలని వాదించనున్నాడు. కార్పియో ముందునుంచే హింసాప్రవృత్తి కలిగినవాడని.. అయితే స్కూల్ వారు దాన్ని పట్టించుకోలేదని జాన్ చెబుతున్నాడు. ఈ గొడవ జరిగినప్పుడు పోలీసులు వచ్చినా.. వారు కూడా కార్పియోపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నాడు. గతంలోనూ కార్పియో విద్యార్థులను, టీచర్లను కొట్టాడని చెబుతున్నాడు. ‘చూడ్డానికి పిల్ల దేవుడిలా కనిపిస్తాడు. కానీ అకస్మాత్తుగా అతడిలోని దెయ్యం బయటకి వస్తుంది. అది నా జీవితంలోనే ఓ కాళరాత్రి’ అని జాన్ నాటి రోజులను గుర్తుకుతెచ్చుకుంటూ ఇప్పటికీ భయపడుతున్నాడట!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana protesters attacked on mp renuka chowdary
The brand arvind kejriwal dilemma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles