Kidnapped doctor released

Kidnapped doctor released,Doctor Harsha reddy, Yashoda hospital, kidnappers released, relatives, Media, police investigations, 40 lakhs demand

Kidnapped doctor released

doctor.gif

Posted: 09/07/2012 03:05 PM IST
Kidnapped doctor released

Kidnapped doctor released

సెల్ సిగ్నల్స్ ఆధారంగా డాక్టర్ ఆచూకీని కనుకొన్న పోలీసులు కిడ్నాపర్ల బారి నుంచి హర్షారెడ్డిని కాపాడారు. హైదరాబాద్ మలక్ పేట యశోద ఆస్పత్రి వైద్యుడు హర్షారెడ్డి కిడ్నాప్ మిస్టరీ వీడింది. కృష్ణాజిల్లా నూజివీడులో హర్షారెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హర్షారెడ్డిని కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హర్షారెడ్డితో పాటు వారిని కూడా హైదరాబాద్ తరలించారు. కిడ్నాప్ వ్యవహారానికి ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులన్నారు. బంధువులే ఈ మొత్తం డ్రామాకు కారణమని తేల్చారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు హర్షారెడ్డి తండ్రి లక్ష్మారెడ్డికి ఇద్దరు భార్యలు. అయితే మొదటి భార్య కుమారులకు లక్ష్మారెడ్డి 17ఎకరాల స్థలాన్ని రాసిచ్చాడు. అదే విధంగా మిగిలిన నాలుగు ఎకరాలను రెండవ భార్య కుమారుడు హర్షారెడ్డికి ఇచ్చాడు. ఇదే వ్యవహారంపైనే మొదటి భార్య కుమారులు తండ్రితో తరచూ గొడవలకు దిగేవారని తెలిసింది. ఆ నాలుగు ఎకరాలు కూడా తమకే రాసివ్వాలని డిమాండ్ చేసే వారని సమాచారం.

ఈ సందర్భంలోనే హర్షారెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  సాయంత్రం 6.20కి కిడ్నాపైన హర్షారెడ్డి వ్యవహారాన్ని పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే ఆ తర్వత కిడ్నాపర్లు హర్షారెడ్డి తండ్రి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి 40లక్షలు డబ్బుల డిమాండ్ చేశారు. దీన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. ఎలాగైనా కిడ్నాప్ మిస్టరీని ఛేదించాలని రంగంలోకి దిగిన పోలీసులు మూడు టీంలుగా ఏర్పడ్డారు.హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడలో ఒక్కో టీం విడిపోయి గాలింపు చర్యలు చేపట్టింది. అనుమానం వచ్చిన వారందరినీ పోలీసులు ప్రశ్నించారు. ఆస్పత్రిలోని సహచర ఉద్యోగినితో హర్షారెడ్డికి ప్రేమ వ్యవహారం ఉందని దీంతో ఆమె తరపు బంధువులే కిడ్నాప్ చేసి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపించాయి.మరోవైపు నల్గగొండ జిల్లాలో హర్షారెడ్డి ఫోన్ లభించింది. అయితే అందులో సిమ్ లేకపోవడంతో పోలీసులు హర్షారెడ్డి కాల్ డేటాపై దృష్టి సారించారు. కేవలం ఫోన్ సిగ్నల్స్ ఆధారంగానే హర్షారెడ్డి కృష్ణా జిల్లా నూజివీడులో ఉన్నట్లు కనుక్కొని మిస్టరీని ఛేదించగలిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Video shows nit warangal student being kicked
Ramoji raos son suman passed away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles