Video shows nit warangal student being kicked

Video shows NIT Warangal student being kicked,kapil sibal, kapil sibal hrd minister, kapil sibal no comment on ragging, warangal nit college, seniors ragging juniors, warangal nit college, every year three students suicide,

Video shows NIT Warangal student being kicked

NIT.gif

Posted: 09/07/2012 03:11 PM IST
Video shows nit warangal student being kicked

Video shows NIT Warangal student being kicked

వరంగల్ నిట్ లో ర్యాగింగ్ అంటూ వచ్చిన కథనాలను కాలేజీ యాజమాన్యం విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. నిట్ ప్రతిష్టను దిగజార్చేందుకే మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందంటూ.. విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. మరోవైపు జిల్లా లీగల్ సెల్ అథారిటీ బమ్ గేమ్ ర్యాగింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతోంది.బమ్ గేమ్ ర్యాగింగ్ ఆరోపణలపై నిట్ యాజమాన్యం, విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎప్పుడో జరిగిన ఘటనను.. ఇప్పుడు పతాకశీర్షికల్లోకి తెస్తూ తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు అవాస్తవాలంటూ నిట్ విద్యార్థులు. ఆందోళనకూ దిగారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిట్ లో బమ్ గేమ్ అంటూ.. మీడియాలో వచ్చిన కథనాలు కలకలం రేపాయి.

కొంతకాలం క్రితం నిట్ లో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరణాలకూ పాల్పడ్డారు. సీనియర్స్ ర్యాగింగ్.. మానసిక ఒత్తిళ్లు, సంఘర్షణలతో ప్రాణాలు తీసుకున్నారు.ఇంత జరిగినా కళాశాల యాజమాన్యం అలాంటివేం లేవంటూ ఎప్పటికప్పుడూ కొట్టి పారేసింది. అయితే.. ఫన్ గేమ్ లాంటి బమ్ గేమ్ ను ర్యాగింగ్ కు ప్రత్యామ్నాయంగా వాడేసుకున్నారు విద్యార్థులు. బర్త్ డే, క్లాస్ లో టాప్ ఇలా ఏ హ్యాపీ మూమెంట్ నైనా ఎంజాయ్ చేయడం కోసం మొదలైన ఈ బమ్ గేమ్ కాస్తా వేధింపుల పర్వంగా మారిపోతోంది. ప్రస్తుతం నిట్ లో ర్యాగింగ్ ఊసే లేదని డైరెక్టర్ స్పష్టం చేస్తున్నారు. ఇన్ స్టిట్యూట్ లో జరిగే విషయాలను తమ దృష్టికి తీసుకురాకుండా, ఇష్టమొచ్చిన రీతిలో వార్తాకథనాలు వేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బమ్ గేమ్ చేష్టలపై జిల్లా లీగల్ సెల్ అథారిటీ నిట్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది.గతంలో జరిగినదైనా.. పూర్తి విచారణ జరిపి చర్యలు తీసకుంటామని అథారిటీ సెక్రటరీ తెలిపారు. ఎవరి వాదనలెలా ఉన్నా.. బమ్ గేమ్.. ఫన్నీ థాట్ కాస్తా.. నిట్ లో ప్రస్తుతం మరో వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister stages walk out at workshop n visakhapatnam
Kidnapped doctor released  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles