హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలు సురక్షితమేగానీ... దాంతో చాలా ఇబ్బందులు. తలను సౌకర్యంగా అటూఇటూ తిప్పలేం. చెమట పట్టి జుట్టు పాడయిపోతుంది. అణిగిపోయినట్టుగా అయిపోతుంది. వెనకాల నుంచి వచ్చే వాహనాలు కొట్టే హారన్ వినపడకపోయే ప్రమాదమూ ఉంది! ఈ ఇబ్బందులన్నిటినీ అధిగమించేలా స్వీడన్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఒక అద్భుత పరిష్కారాన్ని కనుగొన్నారు.ప్రమాద సమయాల్లో కార్లలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడే ఎయిర్‌బ్యాగుల టెక్నాలజీని స్ఫూర్తిగా తీసుకుని.. 'అదృశ్య హెల్మెట్'కు రూపకల్పన చేశారు. మామూలుగా కాలర్ చుట్టూ ఉండే ఈ అదృశ్య హెల్మెట్.. ఏదైనా ప్రమాదం జరుగుతున్న సూచనలు కనిపించగానే 0.1 సెకన్ల వ్యవధిలో గాలితో ఉబ్బిపోయి తలచుట్టూ నిజమైన హెల్మెట్‌లా ఏర్పడుతుంది. స్వీడన్లో సైకిళ్లమీద వెళ్లేవారికి కూడా హెల్మెట్ తప్పనిసరి. ఈ నిబంధనతో విసిగిపోయిన అన్నాహాపట్, తెరెసె అల్స్టిన్ దీన్ని రూపొందించారు. ఈ అదృశ్యహెల్మెట్లో ఉండే బ్లాక్‌బాక్స్, గ్యాస్ ఇన్‌ఫ్లేటర్ వంటి పరికరాలు సమయానుగుణంగా పనిచేసి ప్రాణాలు కాపాడతాయన్నమాట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more