Lakshmi peta srikakulam

lakshmi peta srikakulam

lakshmi peta srikakulam

lakshmi.gif

Posted: 08/17/2012 05:55 PM IST
Lakshmi peta srikakulam

lakshmi peta srikakulam

ఎనభై ఎనిమిదేళ్ల వ్యక్తి హత్యచేయగలడా? ఇన్వెస్టిగేషన్ చేయడం చేతకాదా? ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి ఎలా ఇవ్వగలను? కోర్టులో ఈ కేసు నిలబడుతుందా?'' అంటూ సీఐడీ చీఫ్ రమణమూర్తి ఓ అడిషనల్ ఎస్పీకి క్లాస్‌పీకారు. శ్రీకాకుళం జిల్లా లక్షింపేట కేసు దర్యాప్తు చేసిన అడిషనల్ ఎస్పీ నివేదిక హైదరాబాద్‌కు తీసుకొచ్చి సీఐడీ చీఫ్ రమణమూర్తిని కలిశారు. మొత్తం నిందితుల సంఖ్య 80మంది ఉండటంతో ఇది కరెక్టేనా అని అయన అడిగారు. 60 మంది వరకూ ఉంటారు సార్, అని సమాధానమివ్వడంతో "మరెంతమందిని అరెస్టు చేశావ్''అని అడిగారు, 80మందిని అరెస్టు చేశానని అడిషనల్ ఎస్పీ చెప్పడంతో "కేసు కోర్టులో నిలబడాలంటే దాడులుచేసిన వారెవరో... ప్రోత్సహించిన వారెవరో... ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయో... మృతుల శరీరాలపై గాట్లు ఎన్ని ఉన్నాయో? ముందు తెలుసుకోండి, అక్కడ నిలుచున్న వారిని, 88 ఏళ్ల వయసుండి కదలలేని వారిని కూడా కేసుల్లో చేర్చి సంఖ్య పెంచితే రేపు కోర్టులో నిలబడతాయా? అని ప్రశ్నించారు. అక్కడ పరిస్థితులను బట్టి అందరిపైనా కేసులు పెట్టాల్సివచ్చిందని ఏఎస్పీ తెలిపారు.

ఓ వైపు దళితులు, మరోవైపు అగ్రవర్ణాలు ఉండటంతో కే సు దర్యాప్తు కీలకంగా మారిందన్నారు. దీంతో రమణమూర్తి కల్పించుకొని "అక్కడ ఏం జరిగిందో అదే చెప్పండి, మనకు కులాలు పార్టీలు అనవసరం, వాస్తవాలపై ప్రభుత్వానికి నివేదిక ఇద్దాం, చార్జిషీట్‌లో పొందుపరిచి కోర్టుకు సమర్పిద్దాం'' అన్నారు. "మీరు స్థానికలు గనుక కేసు దర్యాప్తు చేయలేకపోతే చెప్పండి, కరీంనగర్ నుంచి ఇంకో అధికారిని అక్కడికి పంపి వాస్తవాలు వెలికితీయిస్తా'' అని ఘా టుగా చెప్పడంతో దర్యాప్తు అధికారి సోమవారంలోగా నివేదిక తయారుచేసి తీసుకొస్తా అంటూ వెళ్లిపోయారు. అనంతరం ఐజీ చంద్రమౌళిని పిలిచి రమణమూర్తి మాట్లాడారు. వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nri businessman supports mitt romney
Pattu saree in madanapalle  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles