G surya prakash judge at bobbili sub court in vizianagaram district

G Surya Prakash, Judge at Bobbili Sub Court in Vizianagaram district,Judge in sex tape case

G Surya Prakash, Judge at Bobbili Sub Court in Vizianagaram district,Judge in sex tape case

Judge.gif

Posted: 08/16/2012 01:33 PM IST
G surya prakash judge at bobbili sub court in vizianagaram district

ఆయన ఒక ఉన్నతమైన జడ్జి.  అందరకి ఆయనే ఆదర్శం.  అలాంటి జఢ్జి హారతి అనే అమ్మాయికి అన్యాయం చేసాడు.  కేవలం  ఒక్క పసుపుకొమ్ము తో  ఆమె జీవితాన్ని నాశనం చేశాడు.   అసలు విషయం ఏమిటంటే ..   తూర్పు గోదావరి  జిల్లా  పిఠాపురానికి చెందిన జి. సూర్య ప్రకాశ రావు  బొబ్బిలి కోర్టులో  ప్రిన్సిపల్ జూనియర్  సివిల్ జడ్జిగా  పనిచేస్తున్నాడు. అయితే అతనికి దూరపు బంధువు అయిన హారతి అనే అమ్మాయిని వివాహం చేసుకుంటానని నమ్మించి  తన కోరికలు తీర్చుకున్నాడు.  అందుకు బదులుగా  2007 విశాఖపట్నం  రైల్వేక్వార్టర్స్ లోని  తన స్నేహితులు ఇంట్లో  నవంబరు 4వ తేదీన  హారతి  మెడలో  పసుపుకొమ్ము కట్టాడు.  ఇక అప్పటి నుండి ఆమె తో పలుమార్లు ఏకాంతంగా కలిశాడు.  అయితే 2008 , ఏప్రిల్ 30వ తేదీన సౌజన్య  అనే మరో యువతితో  అతనికి  వివాహం నిశ్చయమైంది. 

దీంతో తాను మోసపోయానని  గ్రహించిన హారతి మహిళాసంఘాల  మద్దతుతో నిరసనకు  దిగింది.  అప్పటికి ఫలితం లేకపోవడంతో  సూర్యప్రకాశ రావు పై  విశాఖ పట్నం  పోలీసులకు పిర్యాదు చేసింది.  అతను తనతో ఏకాంతంగా  గడిపినప్పుడు  వీడియో  కెమెరాతో  చిత్రీకరించిన  రెండు డీవీడీ వీడియోలను కోర్టుకు  సమర్పించింది.  ఈ విషయం మీడియాలో కూడా రావడంతో  స్పందించిన  హైకోర్టు  సూర్యప్రకాశ రావును ఖమ్మం ఫస్ట్ క్లాస్  స్పెషల్  జ్యుడిషియల్  మేజిస్ట్రేట్  (ప్రాహిబిషన్  అండ్ ఎక్సైజ్) గా బదిలీ చేసింది.  తర్వాత సస్పెండ్  చేయాలంటూ  ఉత్తర్వులు  జారీ చేసింది.  మరోవైపు  శాఖాపరమైన  విచారణకు  ఆదేశించింది. అయితే ఇంతజరిగిన అతడు పెళ్లి  చేసుకోకపోవడంతో  మానసికంగా కుంగిపోయిన హారతి 2008, నవంబరులో  గాజు ముక్కులు మింగి  ఆత్మహత్యాయత్నం  చేసింది.  విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో చికిత్స  పొందుతూ  డిసెంబర్ 5న మరణించింది.  సూర్యప్రకాశరావు  వ్యవహారంపై విచారణ జరిపిన అధికారి  హైకోర్టుకు నివేదిక  సమర్పించారు.  ఆరోపణలు రుజువు కావడంతో  సూర్యప్రకాశరావును  సర్వీసు  నుంచి తొలగించాలంటూ కోర్టు  ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex cm nedurumalli health condition still serious
Chiru family visit tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles