Floods in andhra pradesh

floods in andhra pradesh

floods in andhra pradesh

7.gif

Posted: 08/06/2012 01:50 PM IST
Floods in andhra pradesh

       ఇటీవల కురిసిన వర్షాలతో గోదావరి నదికి వరదనీరు పోటెత్తుతోంది. వరద నీరు పెరగటంతో ధవళేశ్వరం ప్రాజెక్టు 175గేట్లను flood_s1ఎత్తేశారు. అధికారులు అప్రమత్తమై నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అటు ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతమయ్యాయి. అశ్వరావుపేట మండలంలో పెదవాగు పూర్తిగా నిండిపోయింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో చర్ల దగ్గర తాలిపేరు జలాశయంలోకి భారీగా వరదనీరు వస్తోంది. దీంతో జలాశయం 13గేట్లు ఎత్తి 21వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.
    అటు భద్రాచలం ఏజెన్సీలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా చింతూరు పల్లపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం కేంద్రంగా 101పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ వాగులు పొంగిపొర్లుతున్నాయి. బెజ్జూర్ మండలంలోని కృష్ణపల్లి వాగు ఉప్పొంగుతుండటంతో 10గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరో 30గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. వరదలతో రైతులు నానావస్థలు పడుతున్నారు.
    flood_2కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల  మధ్య నిర్మించిన తమ్మలేకు కాజ్ వే వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెనను తిరిగినిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి 2200క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ దగ్గర 11అడుగుల నీటిమట్టాన్ని ఉంచి తూర్పు ప్రధాన, పశ్చిమ కాలువల ద్వారా అధికారులు సాగునీటిని విడుదల చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telanga leaders fight in swami goud
Constables wifes agitation close  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles