Telanga leaders fight in swami goud

telanga leaders fight in swami goud

telanga leaders fight in swami goud

5.gif

Posted: 08/06/2012 01:53 PM IST
Telanga leaders fight in swami goud

       తెలంగాణ లొల్లీతో తెలంగాణ తమ్ముళ్ల మధ్య వాగ్యాద్ధం తారాస్థాయికి చేరింది దీనికి టీఎన్ జీవో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ ను తెలంగాణ ప్రాంత ఎంపీలు సన్మానించే సందర్భం వేదికైంది. ఈ కార్యక్రమానికి కేశవరావుతో పాటు మంత్రులు జానారెడ్డి, సారయ్య తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంత ఎంపీలుగా తాము ఎన్నో పోరాటాలు చేసామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేశవరావు అన్నారు. తమ చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదన్నారు.  తాము ఏ విధమైన పోరాటం చేయాలనేది ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలు సూచించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. telanganafff
       అటు సభలో ఇతర నాయకులు ప్రసంగిస్తున్న సమయంలో మంత్రి జానారెడ్డి జోక్యం చేసుకుని స్వామిగౌడ్ ను అభినందించాలని సూచించారు. తెలంగాణపై ప్రసంగాలు వద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. దీంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున జానారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేకే,  పొన్నం జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయించడంలో మంత్రులు ఎందుకు శ్రద్ద వహించడంలేదని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నించారు.  తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని  మంత్రి జానారెడ్డి అన్నారు. తాము కూడా తమ స్థాయిలో తెలంగాణకోసం పోరాడుతున్నామన్నారు. తెలంగాణకోసం తాను చేస్తున్న పోరాటం ఉద్యోగులకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దీంతో సభలో మరోసారి జానారెడ్డికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. తనకు జరిగిన సన్మానాన్ని తెలంగాణ ప్రాంతానికి జరిగిన సన్మానంగా భావిస్తున్నానని స్వామిగౌడ్ అన్నారు.
   గతంలో తెలంగాణ కోసం ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన జానారెడ్డి ఇప్పడు మౌనం వహిస్తున్నందునే ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఇకనైనా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ కలిసిపోరాటం చేయాలని స్వామిగౌడ్ కోరారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamilnadu express burning incident report
Floods in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles